ఈ కాలం యువతకు ప్రేమ అనేది  ఆటలా మారింది.ప్రేమచాటున ఎన్ని దారుణాలు,మోసాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తూనే వున్నాం.మన్మధుడు వేసిన బాణం ఒంట్లో కోరికలుపెంచితే,ఆ కోరికల చాటున దాగున్న కామాన్ని తీర్చుకుంటు న్నాడు మగాడు.చివరకు యముడిలా మారుతున్నాడు.ఒక్కరితో మొదలైన తప్పు చివరకు కుంటుంబం ప్రాణాలు కూడ తీస్తుంది.పరువు,ప్రాణం పోయాక ఇక మిగిలేది ఏముంది.ఇప్పటి ప్రేమల పరిస్దితి ఇది.ఒకడు ఇలాగే ప్రేమ పేరుతో అక్కను నమ్మించి ఆమె చెల్లి జీవితాన్ని నాశనం చేసాడు.చివరకు ప్రాణాలు కోల్పోయాడు.ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.



హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతంలో జరిగిన సంఘటన.నాగేశ్వరరావు తన ఇద్దరు కూతుళ్ళు గీత,సంగీతలను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు.చిన్నప్పుడే తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో వారిద్దరికి తల్లిలేని లోటుకూడా తెలియనీయకుండా సాకాడు..పెద్దమ్మాయి గీత పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ కోర్స్ చేయాలనుకుంది.ఇక చెల్లెలు సంగీత ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకుని,ఇంటి పట్టునే ఉంటోంది.గీత సాఫ్ట్‌వేర్ కోర్సు చదువుకునేటప్పుడు అక్కడ ట్యూటర్ నరేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి కొద్దిరోజులుకే ప్రేమ వరకు వెళ్ళింది. అతడిని గాఢంగా ప్రేమించింది.అతనే సర్వస్వం అనుకుంది.ఇంతలో తనకో సంబంధం చూశాడు గీత తండ్రి.అయితే తన ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పింది గీత..నరేష్ కుటుంబ సభ్యులను తీసుకుని ఇంటికి రమ్మని.వారితో మాట్లాడతామని నాగేశ్వరరావు చెప్పాడు.సంతోషపడిన గీత.నరేష్,కుటుంబసభ్యులను తమ ఇంటికి తీసుకురా అని ఫోన్ చేసి చెప్పింది. అయితే తాను అనాధనని,అనాథాశ్రమంలో ఉంటూ చదువుకున్నానని చెప్పాడు..ప్రియుడు అలా చెప్పగానే అతనిపై ఇంకా ప్రేమ పెరిగిపోయింది.



తండ్రికి ఈ విషయాన్ని చెప్పడంతో అతను పెళ్ళికి ఒప్పుకోలేదు.అనాధను పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని కూతురుకు నచ్చచెప్పాడు.తండ్రిని ఎదిరించలేక ఆమె తనలో తానే కుమిలిపోతుంది. కూతురి వేదనను గ్రహించిన తండ్రి చివరకు పెళ్లికి ఒప్పుకుని నరేష్‌ను ఇంటికి తీసుకురమ్మన్నాడు.ఇంటికి వచ్చిన నరేష్ మాటతీరు బాగా నచ్చడంతో,పెళ్ళి ఫిక్స్ చేసేశారు.ఇక పెళ్ళిపీటల మీదకు వెళ్ళడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ముసుగులో వున్న నరేష్‌లోని మృగం నిద్దుర లేచాడు.ఆ కళ్ళు మరదలైన సంగీతపై పడ్డాయి.పెళ్లి బట్టల కోసం షాపింగ్‌కు వెళ్లుచున్న సమయంలో నరేష్‌ తెలివిగా తప్పించుకుని నాగేశ్వరరావు, గీత,వెళ్లేలా చేసాడు.వాళ్లలా షాపింగ్‌కు వెళ్లగానే నరేష్‌ నేరుగా గీత ఇంటికి వచ్చాడు. ఇంట్లో సంగీత ఒంటరిగా వుంది.ఆమెను భయపెట్టి,బెదిరించి ఏదోలా లొంగదీసుకున్నాడు.పెళ్లి దగ్గరపడుతున్నకొద్దీ సంగీత ఇదివరకటిలా ఉండకపోవడంతో అనుమానం వచ్చిన గీత,చెల్లెలిని గట్టిగా నిలదీసింది.ఇంతలో గీతకు ఓ యువతి నుండి ఫోన్ వచ్చింది..



నువ్వు పెళ్ళి చేసుకోబోయే నరేష్ వట్టి కామ పిశాచి అని అమ్మాయులను వాడుకొని వదిలేస్తాడని ఇప్పటికే ఐదుగురు యువతుల జీవితాలతో ఆడుకున్నాడు.నేను అతనిపై కేసు కూడా పెట్టానని యువతి చెప్పింది.ప్రేమించిన వాడు ఎంత వెధవో తెలిసే సరికి గీత పరిస్ధితి చెప్పలేని వేదన మధ్యనలిగి పోయింది.తరువాత చెల్లెలిని గట్టిగా నిలదీసేసరికి అతడు తనపై చేసిన అఘాయిత్యాన్ని,చెప్పింది.ఎంత కౄరంగా తనను లొంగదీసుకున్నాడో వివరించింది.ఇక జరిగిందంతా తండ్రికి కూడా తెలియడంతో తాము మోసపోయా మని తెలుసుకున్నారు.ఇక గీత ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుని,సంగీత మొబైల్ నుంచి ఏమి తెలియని దానిలా నరేష్‌కు నేను నిన్ను ఎలాగైనా కలవాలని అనుకుంటున్నా నని చెప్పి,మెసేజ్ పెట్టింది.ఎక్కడ కలుద్దామని అడిగిన నరేష్‌కు ఒక ప్రదేశాన్ని సూచించింది.ఇంకేముంది,అక్కాచెల్లెళ్ళు అక్కడకు వెళ్లారు,నరేష్‌ అక్కడకు రాగానే, ముందస్తు పథకం ప్రకారం అక్కాచెల్లెళ్లిద్దరూ అతడిని రాళ్ళతో కొట్టి అతి దారుణంగా చంపేసి పోలీస్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయారు..చూసారుగా ప్రేమ పేరుతో జరిగిన డ్రామాలో ఎన్ని జీవితాలు బలైయ్యాయో.అందుకే అమ్మాయిలు చాలా జాగ్రత్త..



మరింత సమాచారం తెలుసుకోండి: