ఉదయం లేవగానే ప్రతి ఒకరు చేసేది ఏంటి అంటే... బాత్ రూమ్ కు వెళ్లి లఘుశంఖ తీర్చుకోవడం.  అలాగే అతను ఉదయం లేసిన తరువాత హడావుడిగా వెళ్లి బాత్ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు.  అంటే.. లోపల ఉన్న దాన్ని చూసి షాక్ అయ్యి మెల్లిగా డోర్ క్లోజ్ చేసి.. ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాడు.  డోర్ ఓపెన్ చేసి చూసిన తరువాత లోపల ఉన్నదాన్ని చూసి ఎక్కడి శంక అక్కడే ఆగిపోయింది.  అంతేకదా మరి.  


ఇంతకీ లోపల ఉన్నదేంటి అనే అనుమానం రావొచ్చు.  అక్కడికే వస్తున్న... లోపల ఉన్న వస్తువు చూస్తే ఎవరైనా  సరే షాక్ తినాల్సిందే.  లోపల ఉన్నది సింహం.  బాత్ రూమ్ లోకి సింహం ఎలా వచ్చింది.  ఎందుకు వచ్చింది.. ఎవరు పంపించారని అనే డౌట్ రావొచ్చు.. అక్కడికే వస్తున్న.. క్యాలిఫోర్నియాలోని టులోమనే అనే ప్రాంతం కొండ ప్రాంతానికి దిగువున ఉన్నది.  ఆ పర్వత ప్రాంతంలో పులులు వంటివి సహజంగా వస్తూనే ఉంటాయి.  


అయితే, పర్వత ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండటంతో.. ఓ పర్వత సింహం కిందకు వచ్చి ఆ ఇంట్లోకి దూరింది.  అలా దూరిన ఆ సింహం చల్లగా ఉన్న ప్రాంతం చూసుకొని బాత్ రూమ్ లోకి దూరింది.  అక్కడే హాయిగా పడకేసింది.  ఉదయాన్నే ఆ ఇంట్లోని వ్యక్తి చూసి మొదట షాక్ అయ్యాడు.  తరువాత నిదానంగా బయటకు వచ్చి ఇంట్లో సభ్యులతో చెప్పడంతో.. ఇంటికి లాక్ చేసి బయటకు వచ్చి అధికారులకు సమాచారం ఇచ్చారు.  


అధికారులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు.  దానంతో పటు చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకొని అరుస్తుండంతో.. హాయిగా నిద్రపోతున్న ఆ  సింహానికి మెలుకువ వచ్చింది.  ఈలోగా అధికారులు లోపలికి వచ్చి ఆ సింహాన్ని పట్టుకోవాలని చూశారు.  కానీ, లాభం లేకపోయింది.  శతవిధాలా కష్టపడి దాన్ని బాత్రూమ్ కిటికీ గుండా బయటకు పంపించారు.  అలా బయటకు వచ్చిన ఆ సింహం పర్వతం వైపుల పరుగులు తీసింది.  ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: