మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారడం.. ఆడవాళ్లు మగవాళ్ళుగా మారడం అన్నది జంబలకడి పంబ అనే సినిమాలో చూశాం.  ఈవీవీ దర్శకత్వం వహించిన ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్.  అలాంటి ఆలోచన చాలా కొద్దిమందికి వస్తుంది.  అది కేవలం సినిమా మాత్రమే.  నిజజీవితంలో అలాంటివి జరుగుతాయని అనుకోకూడదు.  అలాంటివి నిజంగా జరిగితే.. ఇక చెప్పాల్సింది ఏముంటుంది.. చాలా కష్టం.  


అయితే, ఇలాంటి సంఘటన ఒకటి కేరళలో జరిగింది.  అంటే.. నిజంగానే అలా మారిపోయారా అంటే కాదు అని చెప్తాం.  ఎందుకంటే నిజంగా అలా మారిపోలేదు.  కేవలం ఆ పండుగరోజు మాత్రమే అలా మారిపోయారట.  కేరళలో ఓనం పండుగను అక్కడి మహిళలు సాంప్రదాయ బద్దంగా జరుపుకుంటారు.  పట్టు చీరను కట్టుకొని జడలో మల్లెపూలు పెట్టుకొని కేరళ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ పండుగ చేసుకుంటారు.  ఈ పండుగ కోసం చాలా రోజుల ముంచు నుంచే ప్రిపేర్ అవుతుంటారు.  


అయితే, మహిళల్లా మగవాళ్ళు ఓనం పండుగను జరుపుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన అక్కడి వక్తులకు వచ్చింది.  ఐడియా వచ్చిన వెంటనే దాన్ని అమలు చేయాలి.  లేదంటే మరొకరు కొట్టేస్తారు.  అలా కొట్టేస్తే.. ఇక దానికి అర్ధం ఉండదు.  అందుకే వచ్చిన ఐడియాను వెంటనే అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు.  ఆడవాళ్ళలా మగవాళ్ళు అలంకరణ చేసుకున్నారు.  దీపాలు వెలిగించారు.  ముగ్గులు వేశారు.  


చుట్టూ చేరి... గుండ్రంగా తిరుగుతూ.. మనమంతాలు అనే సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.  ఈ తంతంగాన్నంతా వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  వీడియో చూసి పడిపడినవ్వుకుంటున్నారు నెటిజన్లు.  చేస్తే చేశారుగాని... ఆడవాళ్లు లేని చోట మగవాళ్ళు ఇలానే చీరకట్టుకొని ఉద్యోగాలు చేస్తే మరోలా ఉంటుంది జాగ్రత్త అని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.  మొత్తానికి సరదా కోసం చేసిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడం విశేషం.  అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: