Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:27 am IST

Menu &Sections

Search

టిటిడి బోర్డును ప్రభుత్వం కంపు చేసేస్తోందా ?

టిటిడి బోర్డును ప్రభుత్వం కంపు చేసేస్తోందా ?
టిటిడి బోర్డును ప్రభుత్వం కంపు చేసేస్తోందా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాను రాను తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టు బోర్డు రాజకీయాలతో కంపు కొడుతోంది. రెండు రోజుల క్రితమే జంబో జట్టును తలపించేట్లుగా 28 మందితో పూర్తిస్ధాయి బోర్డును నియమించిన ప్రభుత్వం తాజాగా మరో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటమే విచిత్రంగా ఉంది. అంటే తాజా ఉత్తర్వుల ప్రకారం టిటిడి ట్రస్టుబోర్డులో మొత్తం సభ్యుల సంఖ్య 35కి చేరుకుంది. ఇది ఇంతటితో ఆగుతుందా లేకపోతే మరికొందరు నియమితులవుతారో తెలీదు.

 

చంద్రబాబునాయుడుతో సహా  ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా  ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో బోర్డును నియమించలేదు. ప్రభుత్వంలో ఎవరున్నా సిఎం ఇష్టప్రకారమే ఛైర్మన్, సభ్యుల నియామకం జరుగుతుందన్నది వాస్తవం. కాకపోతే ఒకపుడు ట్రస్టుబోర్డంటే అందరిలోను గౌరవం ఉండేది. రానురాను రాజకీయ జోక్యం పెరిగిపోవటంతో పాటు పూర్తిగా రాజకీయ నాయకులతోనే నిండిపోతుండటంతో ట్రస్టుబోర్డంటే అసలు గౌరవమే లేకుండా పోయింది.

 

నిజానికి ఛైర్మన్, సభ్యులుగా నియమితులయ్యే వారి వల్ల తిరుమల ఆలయం ప్రతిష్ట పెరగాలి. కానీ నియామకాలే రాజకీయ ఒత్తిళ్ళతో జరుగుతుండటంతో ఛైర్మన్ అయినా సభ్యులైనా తమ పదవులను గొప్ప చూపించకోవటం కోసమే ఉపయోగించుకుంటున్నారు. తమ వ్యాపారాలను పెంచుకునేందుకు, పలుకుబడి పెంచుకునేందుకే ఛైర్మన్లు, సభ్యులుగా నియమితులైన వారు తాపత్రయపడుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

 

జగన్మోహన్ రెడ్డి తాజాగా నియమించిన బోర్డు చూస్తే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతుంది. నిజానికి ప్రత్యేక ఆహ్వానితులంటూ ఏడుగురిని నియమించాల్సిన అవసరమే లేదు. ఓటింగ్ హక్కు మాత్రం ఉండదట కానీ ప్రోటోకాల్లో ఇతర సభ్యులకున్న మర్యాదలన్నీ అందుతాయట.

 

ఓటుహక్కు లేనపుడు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించటం ఎందుకు ?  ఇప్పటికే ఎక్స్ అఫీషియో సభ్యులుగా నలుగురున్నారు. ఇంతమందని  ట్రస్టుబోర్డులో నియమించటం వల్ల దేవస్ధానానికి భారం తప్ప ఉపయోగం ఉంటుందని అనుకునేందుకు లేదు. కేవలం రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్ళను తట్టుకోలేక ఇలాంటి నియామకాలు జరిపితే చివరకు పలుచనయ్యేది ప్రభుత్వం, దేవస్ధానమే అన్న విషయాన్ని జగన్ గ్రహించాలి.

 


government playing with ttd trust board
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంచలనం : ఆర్టీసీ సమ్మె విషయంలో కెసియార్ కు టిఆర్ఎస్ ఎంపి షాక్
ప్రయాణీకులను పూర్తిగా దోచేస్తున్నారు
కెసియార్ తో పవన్ కు చెడిందా ?
పాలన...అంటే ఎలాగుండాలో చూపిస్తున్న జగన్
దసరా సెలవుల పొడిగింపు రహస్యం ఇదేనా ?
డేంజర్ జోన్ లో రాజధాని ప్రాంతం
చంద్రబాబులో పెరిగిపోతున్న కడుపుమంట
అడ్రస్ లేని తండ్రి, కొడుకులు
రైతులకు నిజంగానే భరోసా..జగన్ లేటెస్ట్ డెసిషన్
’రివర్సు’ పై చేతులెత్తేసిన మంత్రి
చంద్రబాబు పర్యటనల వల్ల ఉపయోగమేంటి ?
విందు రాజకీయానికి రంగం సిద్దం ?
పవన్ కు గండం తప్పదా ?
నారాయణ విషయం తేలిపోతుందా ?
చంద్రబాబు టార్గెట్ గా ఐటి దాడులా ?
చంద్రబాబు భవిష్యత్తును తేల్చేసిన ఎల్లోమీడియా
చెంపలేసుకున్న చంద్రబాబు
కెసియార్ కు పెద్ద షాక్
జగన్ ముందు చేతులెత్తేసిన చంద్రబాబు
రూటు మార్చిన చంద్రబాబు
భయపడే ప్రచారానికి వెళ్ళలేదా ?
కేంద్రంతో విభేదించి నష్టపోయాం..మరీ ఇన్ని అబద్ధాలా ?
చంద్రముఖిలా మారిపోయారా ?
భవిష్యత్తుపై జగన్ మాస్టర్ ప్లాన్
మందుబాబులకు కొత్త అనుభూతి...క్యాప్సూల్ విస్కీ
పిచ్చి ముదిరిపోతోందా ? చంద్రబాబు హ్యాపీ
మెఘా ఛైర్మన్ ఇంటిపై ఐటి దాడులు..పోలవరమే కారణమా ?
ఈ 15న నెల్లూరు ఏం జరగబోతోంది ? పెరిగిపోతున్న టెన్షన్
అమరావతి స్పూర్తిని చంపేసిందెవరు ?
దేవినేని అస్సలు తట్టుకోలేకపోతున్నారా ?
జగన్ ను కాపీ కొడుతున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ
దగ్గుబాటికి జగన్ ఫైనల్ వార్నింగ్ ?
టిడిపి భవిష్యత్తు ఇంతేనా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.