రాశాను ప్రేమ ఓ చిన్న లేఖ అది చేసింది ఎంతో పెద్ద హంగామా అనే మాట ఆ అమ్మాయి విషయంలో నిజం అయ్యింది.  చదువుకునే రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఎట్రాక్షన్ ఉంటుంది.  అందులో తప్పులేదు.  తప్పుకాదు కూడా.  వయసు అలాంటిది.  అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఉండే ఆ ఎట్రాక్షన్ తో లవ్ లెటర్స్ రాసుకోవడం సహజమే.  అటువంటి సంఘటన ఒకటి ఓ యువతి జీవితంలో జరిగింది.  తన జీవితంలో మాజీ ప్రేమికుడు ఎన్నో ప్రేమ లేఖలు రాశాడు.  వాటిని ఆ యువతి భద్రంగా దాచుకుంది.  


ఓ రోజు తాను ఉంటున్న రూమ్ ను శుభ్రం చేస్తుండగా ఆ లేఖలు బయటపడ్డాయి.  విడిపోయారని కోపమో లేదంటే.. అవి ఉంటె దానివలన ఏవైనా ఇబ్బందులు వస్తాయని అనుకుందో తెలియదుగాని, కోపంగా ఆ లేఖలను అదే రూమ్ లో కుప్పగా వేసి తగలబెట్టింది.  అన్ని కాలిపోయాయి అనుకోని వెళ్లి పడుకుంది.  అందులోని ఓ లేఖ కార్పెట్ పై పడింది.  మెల్లిగా కార్పెట్ అంటుకుంది.  క్షణాల్లో రూమ్ లో పొగలు మంటలు వచ్చాయి.  అంతే షాకైన ఆ యువతి.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించింది.  


పాపం ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెద్దగా నష్టం జరగకపోయినా.. అసలు ఎందుకు ఫైర్ అయ్యిందో తెలుసుకొని పాపం ఫైర్ సిబ్బంది నవ్వాలో ఏడవాలో అర్ధంగాక సైలెంట్ గా వెళ్లిపోయారట. ఆ లేఖలను డస్ట్ బిన్ లో వేస్తె ఎవరు చూస్తారు.  లేదంటే. బయట చెత్తలో వేసి కాల్చినా కాలిపోతాయి.  అలా కాకుండా ఇలా ఇంట్లో కాల్చడంతో ఎంతపని జరిగిందో చూడండి పాపం.  


ప్రేమ లేఖలను తగలబెట్టబోయే పాపం ఆ యువతి ఉంటున్న ఇంటిని కాల్చేసుకుంది.  ఈ వార్తా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది.  ప్రేమలేఖలు వస్తే.. వాటికి కాల్చాలి అనుకుంటే ఇలా తగలబెట్టకండి.  ఇంటికి మంటలు అంటుకుంటాయి.  లేనిపోని తలనొప్పి.. అంతేకాదు.. ఇబ్బంది కూడా.  ఏ పని చేసినా కొద్దిగా ఆలోచింది చేయండి.  అన్ని రకాలుగా మంచిది.  లేదంటే ఇదిగో ఇలానే జరుగుతుంది.  అనవసరంగా మంటల్లో చిక్కుకోవాల్సి వస్తుంది.  జరా జాగ్రత సుమా.  


మరింత సమాచారం తెలుసుకోండి: