ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య దూరం మరింతగా పెరిగింది.  ఇండియాలో అలజడులు రేపాలని పాక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.  అంతేకాదు, ఇండియాపై విరుచుకు పడుతూ.. ఇండియాను ఇబ్బందుల్లో పెట్టాలని చూసిన పాక్ పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడిపోయింది.  ఎప్పుడు లేని విధంగా పాకిస్తాన్ ప్రవర్తిస్తోంది.  ఇండియాలో ముఖ్యంగా కాశ్మీర్ లో అలజడులు సృష్టించాలని చూస్తున్నది.  ఈ అలజడులు బేస్ చేసుకొని అంతర్జాతీయంగా ఇండియాను దోషిగా నిలబెట్టాలని అనుకుంది.  


ఇక జెనీవాలో జరుగుతున్న మానవహక్కుల వేదికలో ఇండియాపై కంప్లైంట్ చేస్తామని చెప్పింది. కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని, అంతర్జాతీయంగా మద్దతు ఇవ్వాలని కోరింది.  మానవహక్కుల వేదికలో రిజల్యూషన్ ప్రవేశపెట్టేందుకు 47 సభ్యులదేశాల్లో కనీసం 16 దేశాలు మద్దతు ఇవ్వాలి.  కానీ పాపం పాకిస్తాన్ కు ఒక్క సభ్యదేశం కూడా మద్దతు ఇవ్వలేదు.  


అంతెందుకు స్నేహితుడిగా చెప్పుకునే చైనా కూడా ఈ విషయంలో మద్దతు ఇవ్వలేదు.  పాక్ కు చైనా ఎలాంటి మిత్రుడో ఇప్పటికైనా అర్ధం చేసుకుంటే మంచిది.  పాక్ అనుసరిస్తున్న విధానాల కారణంగానే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  అభివృద్ధిని పక్కన పెట్టి దాయాదిదేశంపై బురదజల్లాలని చూస్తే ఆ బురద తన ముఖానే  పడింది.  ఒక్కదేశం కూడా మద్దతు ఇవ్వకపోవడం శోచనీయం.  


అరబ్ దేశాలు కూడా పాక్ మద్దతు ఇవ్వలేదు అంటే ఆ దేశం పరిస్థితి ఎలా ఉన్నదో అర్ధం అవుతున్నది.  జెనీవాలో ప్రవేశపెట్టలేక పోయింది కాబట్టి, ఇండియాలో అలజడులు సృష్టించే అవకాశం ఉన్నది.  దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా జాగ్రత్తగా ఉంటోంది.  ఇప్పటికే పాక్ కు చెందిన ఉగ్రవాదులు ఇండియాలో ప్రవేశించారని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించారు. కాశ్మీర్ ను జల్లెడ వేస్తున్నాయి.  చాలామందిని అదుపులోకి తీసుకున్నాయి.  పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే కాశ్మీర్ నాయకులు ఇకనైనా బుద్దితెచ్చుకుంటే మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: