జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో  ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం గిరిజనులు ఫుల్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎన్నికలకు ముందు తానిచ్చిన హామీకి జగన్ కట్టుబడి బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేసే ఫైలుపై జగన్  సంతకం చేశారు. ఇదే విషయమై గతంలో చంద్రబాబునాయుడు సంవత్సరాల తరబడి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పారో అందరూ చూసిందే.  బాక్సైట్ మైనింగ్ విషయంలో మావోయిస్టులకు-గిరిజనులకు-ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం ఏర్పాడిన విషయం అందరికీ తెలిసిందే.

 

బాక్సైట్ మైనింగ్ సమస్య అన్నది ప్రధానంగా  విశాఖపట్నంలోని గిరిజన ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. ప్రభుత్వ మద్దతుతో కొందరు నేతలు బాక్సైట్ మైనింగ్ లీజులు తెచ్చుకుని తవ్వకాలు చేస్తున్నారు. అయితే మైనింగ్ పేరుతో గిరిజనుల సంస్కృతిని ధ్వంసం చేయటంతో పాటు కొందరు నేతలు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నట్లు మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ విషయంలో ప్రభుత్వం, నేతలు వెనక్కు తగ్గకపోవటంతో మావోయిస్టులు దాడులు చేసి హత్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

 

చంద్రబాబు హయాంలో మైనింగ్ కు అనుమతులు ఇవ్వటం లేదని ఒకవైపు చూబుతూనే మరోవైపు తమపార్టీ నేతలకు అనుమతులు ఇచ్చేవారు. పాదయాత్ర సందర్భంగా తమ సమస్యలను స్ధానిక గిరిజనులు జగన్ దృష్టికి తెచ్చారు. మైనింగ్ లీజుల రద్దుపై  అప్పట్లో జగన్ వారికి హామీ ఇచ్చారు. అప్పుడు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు మైనింగ్ లీజులను రద్దు చేసే ఫైలుపై జగన్ సంతకం చేశారు.  

 

నేతలు ఎప్పుడైతే మైనింగ్ పేరుతో అడవుల్లోకి రాకపోకలు సాగించటం మొదలుపెట్టడంతో మావోస్టులకు ఇబ్బందులు మొదలయ్యాయి. నిజానికి విశాఖపట్నంలోని మన్యం ప్రాంతం మొత్తం మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం. వేల కిలోమీటర్లలో దట్టమైన అడవులుండటంతో ప్రభుత్వం అధికారులు కానీ పోలీసులు కానీ ఇటువైపు రావటానకే భయపడేవారు.

 

మైనింగ్ పేరుతో నేతలు, కాంట్రాక్టర్లు వాహనల రాకపోకలకు రోడ్లు వేసుకోవటం, మొబైల్ టవర్లు ఏర్పాటవ్వటంతో మావోయిస్టుల ఉనికి బయటపడుతోంది. దాంతో పోలీసులు అడవుల్లోకి గాలింపులు మొదలుపెట్టారు. దాంతో మావోయిస్టుల ఉనికే సమస్యగా మారింది. అందుకనే బాక్సైట్ మైనింగ్ ను మావోయిస్టులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. తమ మాటను కాదన్న నేతలను, అందుబాటులో ఉండే గిరిజన నేతలను హతమారుస్తున్నరు. మొత్తానికి జగన్ తాజా నిర్ణయంతో గిరిజనులు హ్యాపీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: