సైబర్ నేరస్థులు రోజు రోజుకు కొత్త కొత్త తరహాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో ఓటీపీ మోసాలు, ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి డబ్బులు కొట్టేసిన మోసాలు ఎక్కువగా జరిగేవి. కానీ ప్రస్తుతం సైబర్ నేరస్థులు రూటు మార్చారు. మరో కొత్త తరహా మోసానికి సైబర్ నేరస్థులు తెర లేపారు. ఆన్ లైన్ వెబ్ సైట్లలో వస్తువులను కొంటామంటూ వస్తువులు విక్రయించే వారిని మోసం చేస్తున్నారు. నగరాల్లో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 
 
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ సైబర్ నేరస్థుల చేతిలో మోసపోయింది. సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ గా పనిచేసే ఒక మహిళ ఇంట్లోని పాత ఫ్రిజ్ ను విక్రయించేందుకు ఆన్ లైన్ లో ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసిన ఒక అపరిచితుడు ఆ మహిళకు కాల్ చేశాడు. ప్రకటన ఇచ్చిన ఫ్రిజ్ తనకు ఎంతగానో ఎంతగానో నచ్చిందని 18 వేల రూపాయలు చెల్లించి ఫ్రిజ్ కొనుగోలు చేస్తానని అపరిచితుడు ఆ మహిళకు చెప్పాడు. 
 
అపరిచితుడు చెప్పిన మాటలను ఆ మహిళ నమ్మింది. డబ్బులు పంపటం కొరకు గూగుల్ పేకు అనుసంధానమై ఉన్న మొబైల్ నంబరు చెప్పాలని గూగుల్ పే ద్వారా డబ్బులను పంపిస్తానని మహిళకు చెప్పాడు. మహిళ నంబరు చెప్పిన తరువాత మొదట 7 వేల రూపాయలు పంపిస్తున్నానని తరువాత మిగతా డబ్బును పంపిస్తానని నమ్మించాడు. ఆ తరువాత గూగుల్ పే యాప్ కు పంపించిన సందేశాలను యాక్సెప్ట్ చేయాలని చెప్పాడు. 
 
మహిళ పే ఆప్షన్ బదులుగా యాక్సెప్ట్ ఆప్షన్ ను ఎంచుకోవటంతో మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఐదు విడతల్లో మహిళ ఖాతా నుండి 94 వేల రూపాయలు మాయం కావటం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు గూగుల్ పే యాప్ ఉపయోగించి లావాదేవీలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ ప్రాంతానికి చెందిన వారు ఈ తరహా మోసాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: