టిడిపి సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల మృతి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా దుమారం రేపుతోంది. అయితే కోడలు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ  బంజారాహిల్స్ పోలీసులు కోడెల మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కాగా  ఈ దర్యాప్తులో భాగంగా కోడెల మొబైల్ మిస్ అవ్వడం తీవ్ర కలకలం రేపింది. అయితే కోడెల ఫోన్ మిస్ అయినప్పటికీ సెల్ ఫోన్ డేటా ఆధారంగా కీలక సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.

 

 

కోడెల  ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న పోలీసులు... ఆయన సెల్ ఫోన్ డేటాను స్వీకరించి చనిపోయే ముందు చివరి కాల్ ఎవరి తో మాట్లాడాడు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కోడెల ఆత్మహత్యాయత్నం చేసేముందు...ఈ నెల 16 న ఉదయం  9 నుండి 10 గంటల సమయంలో 10 నుంచి 12 ఫోన్ కాల్స్ కోడెల మాట్లాడినట్లు తెలుస్తోంది. పది గంటల ప్రాంతంలో కోడెల గన్మెన్ ఆదాబ్ తో  తొమ్మిది సెకన్లపాటు కోడెల  ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కోడెల సెల్ ఫోన్ నుండి చివరి కాల్ తన గన్ మెన్  ఆదాబ్  తో మాట్లాడినట్లు సమాచారం. కోడెల గది ని పోలీసులు  చేయడంతోపాటు... ఇంట్లోని  కొన్ని వస్తువులను కూడా పోలీసులు సీజ్ చేసి ఏవైనా ఆధారాలు దొరికే  అవకాశం ఉందని భావించి  ఫారిన్సీక్  పరీక్ష కోసం పంపించారు పోలీసులు. ఈ మేరకు అన్ని కోణాల్లో విశ్లేషించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు... కోడెల ఇంటివద్ద సెక్యూరిటీ ని కూడా అప్రమత్తం చేశారు. ఇంట్లోకి వచ్చే వాళ్ళ... పోయే వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: