ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నడుమ అప‌రిష్కృతంగా మిగిలిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునే దిశ‌గా ఇద్ద‌రు సీఎంలు అడుగులు వేస్తున్నారు. ఇద్ద‌రు సీఎంలు భేటీ అయి స‌మ‌స్య‌ల‌ను  పూర్తిస్థాయిలో ప‌రిష్క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించారు. అందుకు ఈ నెల 24న హైద‌రాబాద్‌లో భేటీ అయ్యేందుకు అధికారులు స‌న్న‌హాలు చేస్తున్నార‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విభ‌జ‌న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఆస్తులు, అప్పులుల‌తో పాటుగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు చెందిన కొన్నింటిని విభ‌జించారు. అయితే మ‌రికొన్నింటిని విభ‌జ‌న చేయ‌కుండానే వాటిని రెండు రాష్ట్రాల సీఎంలుగా కూర్చుకుని పంప‌కాలు చేసుకోవాల‌ని, అందుకు కొన్ని విధి విధానాల‌ను ఖరారు చేశారు.


అయితే రెండు రాష్ట్రాలు విడిపోయి ఆరేళ్లు కావొస్తున్నా చాలా స‌మ‌స్య‌లు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదినుంచి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంకు చొర‌వ చూపుతున్నా. ఏపీ గ‌త సీఎం చంద్ర‌బాబు నుంచి సానూకూల స్పంద‌న రాక‌పోవ‌డం, అనేక స‌మ‌స్య‌ల‌పై కొర్రిలు పెట్ట‌డంతో చాలా స‌మ‌స్య‌లు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇక ఐదేళ్లు చాలా ఓపిక‌తో ఉన్న తెలంగాణ ప్ర‌భుత్వం, ఏపీలో అధికారంలోకి వైసీపీ రాగానే స్నేహ‌పూర్వ‌కంగా మారింది. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ స్నేహ హ‌స్తం అందించ‌డంతో అనేక స‌మ‌స్య‌ల ప‌రిష్కారంకు అడుగులు ముందుకు ప‌డ్డాయి.


ఇరు రాష్ట్రాల న‌డుమ పేరుకు పోయిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు గ‌తంలోనూ రెండుసార్లు సీఎంలు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఐఏఎస్ అధికారులు కూడా భేటీ అయిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునేందుక సామ‌ర‌స్య‌పూర్వకంగా ప్ర‌య‌త్నించారు. అవి కొలిక్కి వ‌చ్చిన‌వి. అయితే ఇప్పుడు ఇద్ద‌రు సీఎంలు ఈనెల 24న భేటీ అయితే చాలా స‌మ‌స్య‌లకు పరిష్కారం దొరుకుంతుంది. వీటితో పాటుగా కేంద్ర ప్ర‌భుత్వం రెండు రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు, కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపైనా కేసీఆర్‌, జ‌గ‌న్‌ చ‌ర్చించ‌నున్న‌ట్లు అధికార వ‌ర్గాల స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: