ప్రస్తుతం ప్రపంచం అంతటా కంప్యూటర్ యుగం నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు కూడా కంప్యూటర్ పరిఙానం తప్పనిసరి అవుతోంది. ఈ మధ్య కాలంలో వస్తున్న ఉద్యోగ ప్రకటనలలో కంప్యూటర్ పరిఙానం ఖచ్చితంగా ఉండాలనే నిబంధనలు కూడా రూపొందించటం జరుగుతుంది. అందువలన చాలా మంది యువత కంప్యూటర్ శిక్షణ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. 
 
కానీ హైదరాబాద్ లోని చాలా ఏరియాలలో ఉన్న ప్రముఖ సంస్థలు అక్రమ దందాలకు శ్రీకారం చుడుతూ ధ్రువపత్రాలను ఇస్తున్నారు. పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా ఏ+ గ్రేడుతో ధ్రువ పత్రాలను వెయ్యి రూపాయలకు అమ్మేస్తున్నారు. పదవ తరగతి సర్టిఫికెట్ జిరాక్స్ ఇస్తే చాలు ఒక్కరోజులో ధ్రువ పత్రాలను ఇచ్చేస్తున్నారు. ఏ మాత్రం శిక్షణ, కంప్యూటర్ పై అవగాహన లేకుండా యువతలో చాలా మంది ఈ విధంగా ధ్రువపత్రాలను పొందుతున్నారు. 
 
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కంప్యూటర్ పరిఙానం ఉన్న ధ్రువ పత్రం చాలా అవసరం. ఇందుకోసం నెల నుండి మూడు నెలల సమయం పాటు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. శిక్షణ సమయంలో థియరీ పాఠాలు చెప్పటంతో పాటు కంప్యూటర్ పై ప్రాక్టీస్ కూడా చేయించటం జరుగుతుంది. ఆ తరువాత పరీక్షలను నిర్వహించి పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ సంస్థల నిర్వాహకులు ధ్రువపత్రాలను అందించటం జరుగుతుంది. 
 
కానీ యువతలో చాలా మంది పోటీ పరీక్షలకు ఎక్కువ సమయం కేటాయించి కంప్యూటర్ పరిఙానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. యువతలోని నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని నిర్వాహకులు 700 రూపాయల నుండి 1000 రూపాయలు వసూలు చేస్తూ ధ్రువ పత్రాలను ఇస్తున్నారు. ఒక్కో శిక్షణ సంస్థ రోజుకు 15 నుండి 60 వరకు ధ్రువ పత్రాలను ఈ విధంగా జారీ చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి శ్రమ లేకుండా ధ్రువ పత్రాలు వస్తూ ఉండటంతో యువత ఈ ధ్రువ పత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: