అమ్మతనమంటే అదృష్టముంటేనే దక్కే వరం అంటారు పెద్దలు,కాని ఆ పదానికే మాయని మచ్చలా మిగులుతున్నారు కొందరూ,వాస్తవంగా నీతి నిజాయితిగా బ్రతికే వారు,ఏ పరిస్ధితులకైన ఎదురు నిలబడి పోరాడుతారు.కష్టాలు కడతేర్చాలని చూస్తున్నాయని బ్రతుకుని అడ్డదారిలో నడిపిస్తే వాటివెనక వచ్చే ఫలితాలు చాలా హీనంగా ఉంటాయి. తల్లిగా,భార్యగా న్యాయం చేయలేనప్పుడు బ్రతికి వ్యర్ధమని ఆలోచించాలే కాని కన్నవాళ్లను,కట్టుకున్న వాడిని కాలరాయాలనే ఆలోచన,ఎట్టి పరిస్ధితిలో రాకూడదు.కాని ఇప్పుడు జరిగే పరిస్ధితులు చాలా భయంకరంగా ఉన్నాయి.అక్రమ సంబంధాలకు అడ్డువస్తున్నారని మానవతవిలువలు మరచి చేయకూడని పనులను చేస్తున్నారు కొందరు.ఇక్కడ తల్లి అని చెప్పుకునే ఓ నీచురాలు తల్లి అనే పదానికే తలవంపులు తెచ్చింది.



కుటుంబాన్ని భర్త పట్టించుకోకపోవడంతో మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టకున్న మహిళ నవమాసాలు మోసి ప్రసవ వేదన భరించి కన్న కొడుకు కంటే ప్రియుడే ముఖ్యమనుకుంది.తాత్కాలిక సుఖం అందించే ప్రియుడి కోసం పేగు బంధాన్నే కాదనుకుంది.ప్రియుడితో కలిసి కొడుకును దారుణంగా చంపేసి ఏమీ తెలియనట్లు నంగనాచిలా నటిస్తుంది.గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం ఆకుల గణపవరం గ్రామానికి చెందిన షేక్‌ ఇజ్వాన్‌ గత ఏడాది డిసెంబరు 15న అర్ధరాత్రి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.అతడి తల్లి సైదాబి అదే గ్రామానికి చెందిన వడ్డమాను శ్రీకాంత్‌రెడ్డికి చెందిన పొలంలో కూలి పనులకు వెళ్లేది.ఆమె భర్త జాన్‌వలి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు.అయితే తాగుడుకు బానిసైన జాన్‌వలి కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో,శ్రీకాంత్‌రెడ్డి..సైదాబికి ఆర్థికంగా సాయం చేసేవాడు. దీంతో కొంతకాలానికి వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి తెరలేచింది.



ఈ క్రమంలో జాన్‌వలి ఇంట్లో లేనప్పుడు రాసలీలల దుకాణాన్ని ఇంట్లోనే మొదలు పెట్టారు.ఓ రోజు అసభ్యకర రీతిలో ఉన్న సమయంలో అనుకోకుండా కొడుకు ఇజ్వాన్ ఇంట్లోకి వచ్చి తల్లి కామక్రీడలను కళ్లతో చూసాడు.ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని చెప్పడంతో ఆ జంట కంగారు పడింది.తన భాగోతం భయటపెట్టడమే కాకుండా సంతోషానికి అడ్డొస్తున్న కొడుకు అడ్డు తొలగించుకోవాలని సైదాబి నిర్ణయించుకుంది.ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పగా అతడూ సరేనన్నాడు.ఓ రోజు ఇజ్వాన్‌ను బైక్‌పై ఎక్కించుకున్న శ్రీకాంత్‌రెడ్డి తన పొలానికి తీసుకెళ్లగా,కన్నతల్లి ఉంచుకున్న ప్రియుడు కలసి దారుణంగా హతమార్చి.మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో పడేసి వెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో కేసును పెండింగ్‌లో పెట్టారు.గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి ఇటీవల పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టడంతో అసలు నిజాలు భయటకు వచ్చాయి.ఇప్పుడు ప్రియుడితో కలసి సైదాబి ఊచలు లెక్కపెడుతుంది.క్షణికమైన సుఖం జీవితాంతం మరవని గాయం వాళ్లకు మిగిలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: