మల్లికా శెరావత్.. కొన్నేళ్ల క్రితం.. ఈ పేరు చెబితేనే కుర్రాళ్లు వేడెక్కిపోయేవారు. సెక్సీ స్టార్ గా తనకంటూ బోల్డ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ ఆమె.. అందాల ప్రదర్శనకు అడ్డే లేదన్నట్టు ఉదారంగా ఉండే ఆమె కొన్నేళ్లపాటు హాట్ క్యారెక్టర్లతో కుమ్మేశారు.


మర్డర్, హిస్ లాంటి చిత్రాలు కేవలం ఆమె అందాల ప్రదర్శనతోనే అప్పట్లో కాసుల వర్షం కురిపించాయి. అయితే కేవలం శృంగార తారగా ముద్ర పడిపోవడం వల్ల ఆమె కేరీర్ ఎక్కువ కాలం జోష్ గా సాగలేదు. పాపం.. మన ప్రేక్షకులు చూసిన అందాలు ఎంత కాలం చూస్తారు.. అందులోనూ కొత్త హీరోయిన్ల జోరుతో ఈ అమ్మడు వెనుకబడిపోయింది.


ఆ తర్వాత కరణ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా.. ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అప్పటి నుంచి పెళ్లి పెద్దగా కలసిరాలేదని.. ఓ బిజినెస్ మెన్ తో డేటింగ్ కూడా చేసింది. ఆ తర్వాత అతని నుంచి కూా విడిపోయిన మల్లికా శెరావత్ ప్రస్తుతం సింగిల్ గా ఉంటోంది.


మరి ఓ వైపు వయస్సు మీదపడుతోంది.. ఇంకా పెళ్లి ఆలోచన లేదా అనగానే ఈ అమ్మడు షాకింగ్ జవాబు ఇచ్చేసింది. డేటింగ్ అంటే ఓకే కానీ.. పెళ్లీ గిల్లీ అంటూ బంధాలు పెట్టుకోదలుచుకోలేదని మొహమాటం లేకుండానే చెప్పేసింది. లవ్, రిలేషన్ .. ఓ మగాడితో తనకు అంతవరకే సంబంధం నచ్చుతుంది.. అంటూ అదో మాదిరిగా నవ్వేసింది.


ఎందుకలా అంటున్నారు అని అడిగితే మాత్రం.. లాజిక్కు ఉన్న సమాధానమే చెప్పింది మల్లికా శెరావత్. ప్రేమ, రిలేషన్ ఓకే.. కానీ తల్లిని కావడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మాతృత్వం అనేది చాలా పెద్ద భాద్యత. అలాంటి బాధ్యతలు నేను మోయలేను .. ఆ విషయం నాకు తెలుసు.. పిల్లలు ఉంటే ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచించాల్సి వస్తుంది. వాళ్లకు సమయం కేటాయించాలి. అది నావల్ల కాదు.. ప్రస్తుతం నేను ఇలాగే హ్యాపీగానే ఉన్నా.. ఉన్నన్నాళ్లు ఇలాగే ఉంటా.. అంటూ చెప్పుకొచ్చింది మల్లికా శెరావత్.


మరింత సమాచారం తెలుసుకోండి: