తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో చంద్రబాబునాయు నటించాడా ? అవుననే అంటున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చిన ఉద్యమ నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మీడియాను మ్యానేజ్ అంశంతో పాటు మానసిక వేధనకు గురిచేసే అంశాలపై ఉతికి ఆరేశారు.

 

ముద్రగడ మాట్లాడుతూ మీడియాను చంద్రబాబుకన్నా మ్యానేజ్ చేయగలిగిన వారు ఎవరూ ఉండరన్నారు. కాపు ఉద్యమాన్ని అణిచి వేయటంలో భాగంగా తమ కుటుంబంతో పాటు కాపు నేతలపై చంద్రబాబు ప్రవర్తించిన తీరు సిగ్గు చేటంటూ మండిపోయారు. తమ గ్రామంలో తనను హౌస్ అరెస్టు ఎన్నిసార్లు చేయించలేదని నిలదీశారు. అలాగే తన కుటుంబంపై చంద్రబాబు పాశవికంగా వ్యవహరించలేదా ? పోలీసులను ప్రయోగించలేదా ? అంటూ ప్రశ్నించారు.

 

ఉద్యమ సమయంలో రత్నాచల్ రైలు దహనం కేసులో సంబంధం లేని కాపు నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించింది చంద్రబాబు కాదా అంటూ మండిపడ్డారు. తన హయాంలో చంద్రబాబు ఎంతోమందిపై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి వేధించిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.

 

రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధను నిర్వీర్యం చేసిందే చంద్రబాబు అంటూ చాలా ఉదాహరణలే చెప్పారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోవటానికి కారణమైన చంద్రబాబు తప్పు తనపై ఉండకుండా ఏకంగా సిసి ఫుటేజీనే మాయం చేయించటం అబద్ధమా ? అంటూ నిప్పులు చెరిగారు.

 

బతికి ఉన్నంత కాలం కోడెలను వేధించిన చంద్రబాబు చివరకు అంతిమ యాత్రలో కూడా బ్రహ్మాండంగా జీవించినట్లు మండిపడ్డారు. అంతిమయాత్రలో పాల్గొన్న జనాలను ఉద్దేశించి చంద్రబాబు రెండు వేళ్ళు చూపించటం దేనికి నిదర్శనమన్నారు. చంద్రబాబు పాల్గొన్నది కోడెల అంతిమయాత్ర లేకపోతే విజయయాత్ర ? అంటూ వేసిన ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారో ? మొత్తానికి చాలా కాలం తర్వాత ముద్రగడ మీడియా ముందుకు వచ్చినా లేటెస్టుగానే వచ్చారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: