పార్టీశ్రేణుల్లో ధైర్యంతో పాటు, వారు పార్టీ కోసం ఏంచేయాలో చెప్పడానికి చంద్రబాబునాయుడు హైటెక్ పద్దతిని ఉపయోగిస్తున్నాడు. దీనికోసం ఏకంగా టిడిపి పార్టీ కాల్ సెంటర్ నే ఏర్పాటు చేసాడు. అంతే కాదు తాను తీసుకోబోయే నిర్ణయాలపై కూడా పార్టీ క్యాడర్ అభిప్రాయ సేకరణ కూడా ఫోన్లద్వారానే చేపడుతున్నాడు. ఆధునిక పరిజ్ఞానాన్ని బాబు వాడుకున్నంతగా ఎవరు వాడుకుంటారు, అందుకే ఇందులో ఆశ్యర్యపోవాల్సింది ఏది లేదు. కాని మీ ఊర్లో పార్టీ బలంగా ఉందా, మీ ఇంచార్జి బాగా పనిచేస్తున్నారా, మార్చమంటారా, జగన్ – సోనియా ల మద్య కుదిరిన డీల్ ను ప్రజల్లోకి తీసుకువెల్లడంలో సక్సెస్ అయ్యామా... ఇలా ఎన్నో ప్రశ్నలు వేస్తూ వాటికి అవును అయితో 1 నొక్కండి, కాదు అంటే 2 నొక్కండి అంటూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్ హైదరాబాద్ ఆఫీసు నుంచి ప్రతిరోజు రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంద్ర ప్రాంతాల్లో ఉన్న పార్టీ శ్రేణులందరికి వెలుతున్నాయి. అయితే ఆయన తెలంగాణ, సమైక్యాంద్ర విషయంలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై మాత్రం అభిప్రాయాలు అడగడం లేదంటున్నారు. అదేంటంటే తెలంగాణ ఆపింది నేనే అన్న మాట పని చేసిందా లేదా, మంత్రుల బృందాన్ని బహిష్కరించడం సరైనదా కాదా, అఖిల పక్షాన్ని కూడా బహిష్కరించాం కరెక్టా, కాదా ఇలాంటివి మాత్రం అడగడం లేదు. అదేంటి అసలు సిసలైన అభిప్రాయ సేకరణ జరగాల్సింది వీటి మీదే కదా.. అనుకుంటున్నారా.... కాని ఇక్కడ చంద్రబాబుకు ఓ చిక్కు వచ్చి పడింది. అదేంటంటే ఇలాంటి ప్రతి ప్రశ్నకు ఓ ప్రాంతం నుంచి అవును అని సమాధానం వస్తే మరో ప్రాంతం నుంచి కాదు అని సమాధానం వస్తుంది అనుకుంటున్నారు కదూ, ఇలా వచ్చిన ఫర్వాలేదు, ఈ డొంక తిరుగుడు వ్యవహారం చూసి చంద్రబాబూ.. మీరే వద్దు అని సమాధానం చెప్పాలంటే ఏ బటన్ నొక్కాలి అన్న సమాధానం ఎక్కడ వస్తుందో అన్న భయం కొద్దే ఈ ప్రశ్నలు వేయడం లేదని రాజకీయ వర్గాలు వ్యంగ్యంగా మాట్లాడుతూ చమత్కరించుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: