సేవ్ నల్లమల పేరుతో కొద్దిరోజుల క్రితం పోరాటం ప్రారంభమైంది.  నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే తమ ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే యురేనియం తవ్వకుండా ఆపుతామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పిన తరువాత, తెరాస పార్టీ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని పేర్కొన్నది.  తవ్వకాలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది.  


యురేనియం తవ్వకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదట పోరాటం మొదలుపెట్టింది.  యురేనియంపై పోరాటం చేసే విషయంలో వేసిన కమిటీకి వీహెచ్ అధక్షుడిగా ఉన్నారు.  యురేనియంపై పవన్ ట్వీట్ చేసిన తరువాత, వీహెచ్ వెళ్లి జనసేన పార్టీ అధ్యక్ధుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు.  ఇద్దరి మధ్య మాటలు జరిగాయి.  యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో కలిసి పోరాటం చేద్దామని అన్నారు.  


దానికి పవన్ కూడా సరే అని చెప్పడంతో.. కాంగ్రెస్.. జనసేన పార్టీలు యురేనియం విషయంలో కలిసిపోయాయి.  బర్నింగ్ ఇష్యూ కావడంతో జనసేనకు కలిసి వచ్చింది.  జనసేన చేసిన ఈ పోరాటం ఫలితంగా కొంత మార్పు వచ్చింది అని చెప్పొచ్చు.  అయితే, అంతకు ముందు కమిటీని ఏర్పాటు చేసి.. దానిపై పోరాటం చేస్తూ రోడ్డుపై భైటాయించినా జరగని పని, పవన్ ట్వీట్ చేయడంతో పాటు అటు సెలెబ్రిటీలు సేవ్ నల్లమలకు సపోర్ట్ చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది.  


యురేనియం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.  యురేనియంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే.. ఆ క్రెడిట్ జనసేన ఖాతాలోకి వెళ్ళింది.  జనసేన పార్టీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం.. దానికి కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం.. కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు పవన్ తో కలిసి పనిచేస్తామని చెప్పడంతో.. కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వృధా అయినట్టైంది.  ఇదే ఇప్పుడు ఆ పార్టీని ఇరకాటంలో పెట్టింది.  మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: