రాజన్న బిడ్డని...జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ షర్మిల...త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారని తెలుస్తోంది. ఇంతకాలం పార్టీ ప్రచార కార్యక్రమాలకే పరిమితమైన షర్మిలా....ఇక నుంచి పార్టీలో కీలక నేతగా వ్యవహరించనున్నారని వైసీపీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయితే జగన్ జైలుకు వెళ్ళేవరకు షర్మిల ఎవరో పెద్దగా ఎవరికి తెలియదు.  కొందరికి మాత్రమే దివంగత వైఎస్సార్ తనయ అని తెలుసు.


ఒకవైపు తండ్రి చనిపోవడం..మరోవైపు అన్న జైలుకు వెళ్ళడం. అలాగే జగన్ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమైన వేళ. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పార్టీ బాధ్యతలని భుజాన వేసుకున్నారు. తల్లి విజయమ్మతో కలిసి నియోజకవర్గాలు అన్ని తిరిగి ప్రచారం చేసి... పార్టీని 15 సీట్లలో గెలిపించారు. ఆ తర్వాత కూడా అన్న జైల్లో ఉన్న..పార్టీని నడిపించడానికి...తను వేల కిలోమీటర్లు నడిచారు. ఎన్ని అవరోధాలు ఎదురైన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నుండి శ్రీకాకుళం జిల్లా వరకూ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలని తెలుసుకున్నారు.


ఇక అన్న జైలు నుంచి తిరిగిరావడంతో..2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే అప్పుడు పార్టీ ఓటమి పాలవ్వడంతో సైలెంట్ అయిపోయారు. అయితే అప్పుడు షర్మిలకు జగన్ ఏదొక పార్టీ పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ఇక ఐదు సంవత్సరాలు సైలెంట్ గా ఉన్న షర్మిలని జగన్...మొన్న ఎన్నికల ప్రచారంలో దింపారు.


ఆ ప్రచారంలో ఆమె చంద్రబాబు, నారా లోకేశ్ లపై తన వాగ్భణాలని సంధించి ఓటర్లని ఆకట్టుకున్నారు. వెరసి ఎన్నికల్లో వైసీపీ భారీగా సీట్లు దక్కించుకోవడం....తన అన్న జగన్ సీఎం అయిపోవడం జరిగిపోయాయి. దీంతో షర్మిలకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారు. కానీ జగన్ కుటుంబ సభ్యులని ప్రభుత్వానికి దూరంగా పెట్టారు. అయితే కార్యకర్తలు మాత్రం షర్మిలకు పార్టీ పదవైనా ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వచ్చే పార్టీ ప్లీనరీ సమావేశాల్లో షర్మిలకు పదవి ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: