శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్‌నాయుడు తెలుగుదేశం పార్టీ వీడి బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారు. కేంద్ర క్యాబినేట్‌ మంత్రి పదవి ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితులైన ఒక మంత్రి మరియు బిజెపి ముఖ్య నేత ద్వారా రాయబారం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాను బిజెపిలో చేరేందుకు సిద్దమేనని కానీ తన సన్నిహితులను బందు మిత్రులను కలిసి వారితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని వారికి తెలిపారట. కేంద్రమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్‌ బిజెపి ఇంఛార్జి ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో ఢిల్లీలో ఒక హోటల్‌లో చర్చలు జరిపినట్లు తెలిసింది. తాను బిజెపిలో చేరితే కేంద్ర మంత్రి అవుతానని శ్రీకాకుళం జిల్లాను ఎంతో అభివృద్దిలోకి తీసుకువెళతానని సన్నిహితులకు, బందుమిత్రులకు చెపటంతో వీరిలో ఎక్కువ మంది ఆయన తీసుకోబోయే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మీ తండ్రి ఎర్రంనాయుడిని చంద్రబాబు జాతీయ స్థాయిలో పదవులిచ్చి రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించారు. అదే విధంగా నీకు ఆయన వారసత్వాన్ని అప్పజెప్పి జాతీయ స్థాయికి పెంచారు.



పార్టీ మారితే మంత్రి అవుతావో లేదోమాకు తెలీదు. కానీ టిడిపిలో హీరోగా ఉన్న మీరు బిజెపిలో చేరితే జీరో అవుతారని, అమిత్‌ షా, మోడీలకు వంగి వంగి దండాలు పెట్టాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలిసింది. మీకు ఎంపీ సీటు, నీ సోదరికి ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. మీ బాబాయికి మంత్రి పదవిని కట్టబెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో మీ కుటుంబం అటు పార్టీని ఇటు అధికారాన్ని చెలాయిస్తుంది. ఇంత కన్నా ఏం కావాలి అని సన్నిహితులు చెప్పినట్లు బయటకు పొక్కింది. ఆ తర్వాత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా తన అన్న కుమారుడు అయిన రామ్మోహన్‌ నాయుడిని పరోక్షంగా హెచ్చరించినట్లు తెలిసింది. టిడిపి వలన మనం నాయకులం అయ్యాం నేను మంత్రి అయ్యాను.  మీ నాన్న జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఒక వేళ నువ్వు పార్టీ మారితే నీ స్థానంలో నా కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకు వస్తాను. మనం అదికారంలో ఉన్న లేకున్నా ఎన్నికలలో గెలిచినా ఓడినా టిడిపిలో ఉంటేనే మనకు విలువ ఉంటుందన్నారట. దీంతో అటు కుటుంబసభ్యులు, ఇటు శ్రేయోభిలాషులు ముక్త కంఠంతో పార్టీ మారవద్దు.బిజెపి ఉచ్చులో పడద్దు.





టిడిపిలోనే ఉండండి. చంద్రబాబు నాయుడు మీ కుంటుంబానికి ఎప్పుడు అండగా ఉంటారు అని చెపటంతో రామ్మోహన్‌ నాయుడు బిజెపిలో చేరే నిర్ణయాన్ని విరమించుకుంటున్నాని బిజెపి నేతలతో చెప్పినట్లు తెలిసింది. రామ్మోహన్‌నాయుడు ఏమిటి…? కేంద్ర మంత్రి పదవికి ఆశపడటం ఏమిటి…? కేంద్రమంత్రితో బిజెపి నేతలతో రహస్య చర్చలు జరపటం ఏమిటి..? ఎక్కడున్న వాడిని ఎక్కడికో చంద్రబాబు తీసుకెళ్లారు. అది మరిచిపోయి మంత్రి పదవికి ఆశపడటం ఏమిటి…? పదవి లేకుంటే రాజకీయాలలో ఉండలేరా.. కేంద్రమంత్రి అయినంత మాత్రాన రాష్ట్రంలో ఆయన పెత్తనం చెలాయించగలరా..? చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన జీవించి ఉన్నంత కాలం టిడిపి కి ఢోకా లేదు. చంద్రబాబు లేనప్పుడు ఆలోచించాల్సిన విషయాన్ని ఆయన ఉన్నప్పుడే ఆలోచించి తప్పు చేశారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. టిడిపి నేతగా చంద్రబాబు ఉన్నంత కాలం ఆ పార్టీకి ఎదురు ఉండదు.. భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్లీ టిడిపిదే అధికారం.


మరింత సమాచారం తెలుసుకోండి: