ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో ఐన్ స్టీన్ ఒకరు.  అయన తన జీవితంలో ఎన్నింటినో ఆవిష్కరించారు.  ఎన్నో గొప్పగొప్ప పరిశోధనలు చేశారు.  అన్నింటికీ మించి సాపేక్ష సిద్ధాంతం, క్వాంటం సిద్దాంతం రూపొందించారు.  ఈ రెండు చాలా క్లిష్టమైన సిద్ధాంతాలు.  అర్ధం చేసుకోవడం చాలా కష్టమైన విషయం.  ముందు దానిపై పూర్తిగా అవగాహనా కలిగిన వ్యక్తులు బోధించాలి.  అలా కాకుండా సగం తెలిసి.. సగం తెలియక బోధిస్తే.. దాని వలన కలిగే ఇబ్బందులు అలానే ఉంటాయి.  ఫలితంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము.  


అర్ధంగాక జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.  అయితే, ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని అద్భుతంగ అర్ధం చేసుకొని అందరికి అర్ధమయ్యేలా చెప్పిన వ్యక్తి ఎమీ నోటర్.  జర్మన్ గణితవేత్త.  చిన్నప్పటి నుంచి గణితంలో రాణించిన మహిళ ఆమె.  మోడ్రన్ ఆల్జీబ్రాకు పునాదులు చేసిన గణితవేత్త.  అంతేకాదు, సాపేక్ష సిద్ధాంతాన్ని ఈజీగా అర్ధం చేసుకోవడానికి కొన్ని గణిత సూత్రాలను ప్రతిపాదించింది.  ఈ సూత్రాల ఆధారంగా సాపేక్ష సిద్ధాంతాన్ని ఈజీగా అర్ధం చేసుకోవచ్చు.  అందుకే తన నోటర్ గొప్ప మేధావి అని స్వయంగా పేర్కొన్నారు.  


1882లో జర్మనీలో జన్మించిన నోటర్ ఎన్నో వివక్షలను ఎదుర్కొంది.  తండ్రి జర్మనీలోని ఎర్లాంజన్ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.  తండ్రి నుంచి ఆమె గణితం నేర్చుకుంది.  అయితే, విశ్వవిద్యాలయంలో ఆమెకు సీటు ఇవ్వలేదు.  అప్పట్లో మహిళలపై వివక్ష ఉండేది.  విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వారికీ అర్హత లేదు.  అయితే, యూనివర్శిటీ ప్రొఫెసర్లు రికమండ్ చేస్తే క్లాస్ రూమ్ లో కూర్చోవచ్చు.  


ఉద్యోగం చేసేందుకు కూడా అనుమతి లేదు.  ఒకవేళ ఉద్యోగం చేయాలి అంటే ఆ యూనివర్శిటీలో ఫ్రీగా పనిచేయాలి.  చదువుకున్న చదువును వృధా చేయడం ఎందుకు అని చెప్పి ఫ్రీగానే క్లాసులు చెప్పడం మొదలుపెట్టింది.  ఆల్జీబ్రాను చాలా ఈజీగా ఎలా అర్ధం చేసుకోవచ్చో చూపించింది.  ఆమె రూపొందించిన కొన్ని సిద్ధాంతాలు సాపేక్ష సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి.  అనంతరం జర్మనీ నాజీ పార్టీ చేతుల్లోకి వెళ్లడంతో.. నోటర్ కుటుంబం అమెరికా వెళ్ళింది.  అక్కడ ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసింది.  1935 ఆమె అనారోగ్యంతో మరణించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: