ఈ కాలం అమ్మాయిల చాటుమాటు చాటింగ్‌లకు అంతే లేకుండా పోతుంది.కాస్త పరిచయం ప్రేమగా మారితే,ఆ ప్రేమ కామం తో కూడుకొని లోలోనే బుసలు కొడుతుంది.ఓ మంచిరోజు చూసుకుని కాటేయడానికి పన్నాగం పన్నుతుంది.అందుకు నటన అనే కాన్సెప్ట్ పక్కాగా అమలు చేసి,నమ్మిస్తుంది.ఆ నమ్మకం అనే గోతిలో పడి అమ్మాయిలు ఎదుటి వాడు ఏది చెప్పితే అది చేస్తారు.చివరికి రవికాంచని చోటును కూడా ఆ వెధవకు చూపిస్తారు.వాడు దాన్ని నలుగురికి చూపిస్తానని బ్లాక్ మేయిల్ చేయడం లేదా ఇంటర్‌నెట్లో అప్‌లోడ్ చేస్తానని చెప్పడం జరుగుతుంది.నలుగురిలో పెళ్లిచేసుకుని పడక గదిలో కట్టుకున్న ఒక్కడికి తప్ప పరులకు చూపించని అందాల్ని ఇలా బజారుపాలు చేసుకుంటున్నారు కొందరు.వారి బుద్ది సక్రమంగా పనిచేస్తుందో లేదో,చదువున్న చదువు,తెలివి ఏ గంగలో కలిపేసారో కాని మోసపోయేవాడి చేతికి చిక్కి నిండా మునిగాక కేకలు పెడుతున్నారు.ఇక ఇప్పుడు ఇలాంటి సంఘటనే జరిగింది.అదేంటో,ఓ లుక్కేద్దాం పదండి.



తాను అడిగినంత డబ్బు ఇస్తేగాని తనకు పంపిన నగ్నంగా వున్న వీడియో డిలీట్‌ చేయనని 30 ఏళ్ల మోడల్‌ను ఆమె ప్రియుడు వేధించిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ముంబైకి చెందిన 30 ఏళ్ల మోడల్‌  గత ఏడాది సామాజిక మాధ్యమాల్లోని బిగ్గో అనే యాప్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని పోలీసులకు తెలిపింది.అతను తన స్నేహితుడితో కలిసి సౌదీ అరేబియాలో పనిచేస్తుంటాడని, దీంతో తన ఫోన్‌ నంబర్‌ను అతని స్నేహితుడికి ఇవ్వడంతో సోషల్‌ మీడియా ద్వారా వారిద్దరు కలుసుకున్నట్లు తెలిపింది. అలా రోజు అతనితో చాటింగ్ చేస్తూ చేస్తూ రోజులు పోయి సంవత్సరం వచ్చేసింది తర్వాత వారిద్దరు వీడియో చాటింగ్‌ ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టామని,ఈ క్రమంలో అతను తనను ఎంతగా నమ్మించాడంటే తనని ప్రేమిస్తున్నాని,పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు బాధితురాలు పేర్కొంది.



తను నన్ను పెళ్ళిచేసుకుంటాడని నమ్మిన నేను అతనితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేదాన్ని,చివరకు నా పర్సనల్స్ కూడా చెప్పేదాన్ని అలా మాట్లాడుకుంటుండగా ఉన్నట్టుండి ఓ రోజు తన నగ్న వీడియో పంపించమని అడగగా దానికి తాను అంగీకరించి పార్షల్‌ న్యూడ్‌ వీడియో పంపించినట్లు తెలిపింది.ఇక గురుడి నాటకం రక్తికట్టగా అప్పటి నుంచి ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని లేదంటే నువ్వు పంపిన వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడట. దానికి ఆమె నిరాకరించడంతో ఆ వీడియో తన స్నేహితులకు,దగ్గరి వారికి పంపించాడట.ఈ విషయం తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్న బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది.ఇంకేముంది దుకాణం కట్టే సమయం దగ్గర పడ్డది.కేసు బుక్ ఐయ్యింది.ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది.ఇక మనం మారం కాని ఓ తెగ అన్యాయమై పోతున్నట్లుగా ఫీలవ్వుతాం.ఇదండి లోకం పోకడ..



మరింత సమాచారం తెలుసుకోండి: