వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ.. ఇప్పుడు మాంచి జోరు మీద ఉన్నారు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న అంశాలన్నీ క్లియర్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మొన్నటికి మొన్న 70 ఏళ్ల నాటి ఆర్టికల్‌ 370 ను రద్దు చేసేశారు. ఇక ఇప్పుడు అయోధ్య అంశంపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. తాను రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు పోతారనే పేరున్న మోదీ.. ఇక ఇప్పుడు రామాలయం విషయం తేల్చేయబోతున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.


వివాదస్పద అయోధ్య రామమందిరం గురించి ఇంతకాలం మౌనంగా ఉన్న ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు నోరు విప్పి సంచలన కామెంట్లు చేశారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును విశ్వసిద్దాం.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండు – మూడు వారాలుగా కొంతమంది.. రామమంది రం అంశంపై ఉన్నవీ లేనివీ మాట్లాడుతున్నారని అయితే.. మనం సుప్రీంకోర్టును గౌరవించడం తప్పనిసరి అని అన్నారు. దేశ రాజ్యాంగంపైన – న్యాయవ్యవస్థపైనా మనకు విశ్వాసం ఉండాలన్నారు.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో మోడీ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణంపై శివసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన్పటి నుంచే అంటే ఐదేండ్లుగా పదేపదే డిమాండ్‌ చేస్తోంది.రామ మందిరం అంశం 1992 నుంచి కొనసాగుతూనే ఉందని.. ఇంకెన్నాళ్లు వేచి ఉండాలని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల వ్యాఖ్యానించారు..


కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా.. ఆర్టికల్‌ 370పై ధైర్యంగా నిర్ణయం తీసుకున్నట్టే కేంద్రం రామమందిరంపైనా కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలని.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. మోదీ మాత్రం శివసేన పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ..అంటే ప్రధాని నరేంద్రమోదీ రామమందిరం నిర్మాస్తామని అన్యాపదేశంగా చెపుతూనే చట్టాన్ని గౌరవిద్దామని ముక్తా ఇస్తున్నారు. అంటే మోదీ మదిలో రామమందిర నిర్మాణంపై పక్కా క్లారిటీతో ఉన్నారనే అర్థం.


మరింత సమాచారం తెలుసుకోండి: