సెప్టెంబర్ 27 వ తేదీ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  సెప్టెంబర్ 24 నుంచి 30 వ తేదీ వరకు ఐరాస సర్వసభ సమావేశాలు జరగబోతున్నాయి.  ఈ సమావేశాల్లో వివిధ అంశాల గురించి సభ్యదేశాలు మాట్లాడబోతున్నాయి.  మొదటి రోజు రోజుల్లో మాట్లాడే అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల్లో మోడీకూడా ఉన్నారు.  సెప్టెంబర్ 27 వ తేదీన మోడీ ఐరాసలో మాట్లాడతారు.  అయితే, మోడీ ఏ అంశం గురించి మాట్లాడబోతున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది.  


ఐరాస సమావేశాల్లో కాశ్మీర్ అంశం ప్రధానంగా ఉండదు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్ధం అవుతున్నది.  జమ్మూ కాశ్మీర్ భారత్ భూభాగం.  భారత్ అంతర్గత విషయం.  అందులో మరోదేశం తలదూర్చే అవకాశం కల్పించబోమని ఇప్పటికే స్పష్టం చేసింది ఇండియా.  ఈ విషయాన్నీ  పలు వేదికలపై స్పష్టం చేసింది.  1947 వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తరువాత కాశ్మీర్ లోని కొంతభాగాన్ని పాక్ ఆక్రమించుకుంది.  ఆ భాగాన్ని ఇండియా తిరిగి ఎప్పటికైనా తీసుకుంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది.  


ఏదైనా మాట్లాడాలి అంటే అది పీవోకే విషయంలో మాత్రమే మాట్లాడతాం అని ఇండియా ఇప్పటికే స్పష్టం చేసింది.  పీవోకేలో మానవహక్కులు ఉల్లంఘనలు తీవ్రస్థాయిలో ఉన్నాయని ఇప్పటికే ఇండియా స్పష్టం చేసింది. అయితే, పీవోకే విషయంలో మూడో దేశం ప్రమేయం అక్కర్లేదని ఇండియా స్పష్టం చేస్తోంది.  ఇండియా పాక్ లు చర్చించుకోవాల్సిన అంశంగా పేర్కొన్నది.  


దీనిపై సర్వసభ దేశాల సమావేశాల్లో లేశమాత్రంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  దీనిపై  రావొచ్చని ఐరాస అధ్యక్షుడు పేర్కొన్నారు.  అంతేకాదు, సెప్టెంబర్ 27 వ తేదీన ఐరాసలో కాశ్మీర్ అంశాన్ని తీసుకొస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశాడు.  ఇటీవలే జెనీవాలోని మానవహక్కుల సంఘం ఒక ప్రతిపాదనను ప్రవేశపెట్టేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే.  47 దేశాల్లో ఒక్క దేశం కూడా సపోర్ట్ చేయకపోవడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: