నేడు ఢిల్లీ  నుంచి మోడీ  అమెరికా  పర్యటనకు బయలుదేరనున్నారు . అయితే ఎప్పుడూ లేనంతగా మొదటిసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కాగా నేటి నుండి ఈ నెల 27 వరకు అమెరికాలో మోడీ  పర్యటించనున్నారు. మోడీ మొదటగా టెక్సాస్  లోని హోస్టస్  న్యూయార్క్ లో  పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీ   భేటీ అవ్వనున్నారు . అనంతరం డెమోక్రటిక్ నేతలతో కలిసి  మోదీ ప్రసంగం చేయనున్నారు. 

 

 

 అనంతరం రేపు ఆదివారం  ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోడీ  పాల్గొననున్నారు. కాగా  మోదీ ఈ సదస్సులో  పాకిస్తాన్ తీరును  ఎండగట్టేందుకు అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. కాగా  ప్రధానంగా  ఆరోగ్యం,  టెర్రరిజం పైన భారత ప్రధాని మోడీ ఈ  ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ప్రసంగించనున్నారు . ఆ తర్వాత ఎన్ఆర్జి  స్టేడియంలో ఎన్నారైలు ఏర్పాటుచేసిన సదస్సులో మోడీ పాల్గొన్నారు. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొనే ఈ భారీ ఈ చారిత్రాత్మక సదస్సు కు... అమెరికా అధ్యక్షుడు ట్రంపు కూడా  విచ్చేయడం  ఇదే మొదటిసారి కావడంతో ఈ సదస్సు  ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఈ సభలో 90 నిమిషాల పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగబోతుండగా... 400 మంది కళాకారులు ఇక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు  . అయితే ఈ ఎన్ఆర్ఐ సదస్సుకు  అమెరికన్ ప్రముఖులు,  మేయర్లు,  కాంగ్రెస్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. 

కాగా  మోడీ ట్రంప్  భేటీతో  భారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దీంతో దీంతో దేశానికి మేలు చేకూర్చే అంశాలు ఎన్నో ఉన్నాయని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: