ఈ మధ్య కాలంలో చాలా మంది యువత ఫ్రీ వైఫై ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్, ఇతర ప్రదేశాల్లో కొన్ని చోట్ల ఫ్రీ వైఫై లభ్యమవుతోంది. ఈ ఫ్రీ వైఫైని ఉపయోగించి యువత సినిమాలు, పాటలు, వీడియోలు ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకోవటం జరుగుతుంది. పబ్లిక్ వైఫైని సాధారణ బ్రౌజింగ్ కొరకు ఉపయోగిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు కానీ బ్యాంకింగ్ కు సంబంధించిన లావాదేవీల కొరకు మాత్రం పబ్లిక్ వైఫై ఎట్టి పరిస్థితులలోను వాడకూడదు. 
 
పబ్లిక్ వైఫై ఉపయోగించి బ్యాంకింగ్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చేస్తే అకౌంట్లలో డబ్బులు మాయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పబ్లిక్ వైఫై వినియోగించిన వారి వివరాలు వైఫై ప్రొవైడ్ చేసేవారికి సులభంగా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన బ్యాంకింగ్ కు సంబంధించిన లావాదేవీల కొరకు ఫ్రీ వైఫై ఉపయోగిస్తే మన వివరాలు అవతలివారికి సులభంగా తెలిసే అవకాశం ఉంది. 
 
పబ్లిక్ వైఫై ఉపయోగించి మనకు తెలియని వెబ్ సైట్లను ఓపెన్ చేస్తే బ్రౌజింగ్ చేసే సమయంలో మాల్ వేర్ మన మొబైల్ లోకి ప్రవేశించి మొబైల్ లోని వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన తరువాత మన సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. బ్యాంకులు కూడా వినియోగదారులను పబ్లిక్ వైఫై ఉపయోగించి లాగిన్ కావొద్దని సూచనలు చేస్తున్నాయి. 
 
ప్రభుత్వ రంగ బ్యాంకులలో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రీ వైఫై ఉపయోగించి అకౌంట్లలోకి లాగిన్ కావద్దని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరికలు జారీ చేసింది. కొంత మంది బ్యాంకులో పని చేస్తున్నామని చెప్పి ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు అడిగితే చెప్పవద్దని  కూడా బ్యాంకులు వినియోగదారులకు సూచిస్తున్నాయి. పబ్లిక్ వైఫైకు దూరంగా ఉండటం వలన వ్యక్తిగత వివరాలు ఎవరూ తస్కరించకుండా జాగ్రత్త పడవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: