ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు సీఆర్డీఏ అధికారులు  ఊహించని షాక్ ఇచ్చారు . ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను వారం రోజుల వ్యవధిలో ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు . గతం లోను లింగమనేని గెస్ట్ హౌస్ కు నోటీసులు ఇచ్చిన సీఆర్డీఏ అధికారులు, ఇంటి యజమాని ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని , మరోసారి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . గెస్ట్ హౌస్ ఖాళీ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రికి వారం రోజుల వ్యవధిని ఇచ్చిన సీఆర్డీఏ అధికారులు, లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .


 కృష్ణా నది కరకట్ట పై ఉన్న   లింగమనేని గెస్ట్ హౌస్ కు శుక్రవారం సాయంత్రం నోటుసులు అంటించిన సీఆర్డీఏ అధికారులు, మిగిలిన ఇళ్లకు మాత్రం ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని తెలుస్తోంది . దానికి కారణం ... వారు ముందస్తుగానే  కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడమేనని తెలుస్తోంది . కృష్ణా నది పరివాహక ప్రాంతం లో నిబంధలు విరుద్ధంగా లింగమనేని గెస్ట్ హౌస్ నిర్మించిన విషయం తెల్సిందే . టీడీపీ అధికారం లో ఉన్న నాటి నుంచి గెస్ట్ హౌస్ అక్రమాలపై పోరాడుతున్న వైకాపా నేతలు, తాము అధికారం లోకి రాగానే ఈ గెస్ట్ హౌస్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కన్పిస్తోంది .


నది పరివాహక ప్రాంతం లో గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక ను జగన్ సర్కార్ కూల్చడం ద్వారా , లింగమనేని గెస్ట్ హౌస్ ను కూడా కూల్చివేయడం ఖాయమన్న సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు అయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  అయితే నిబంధలు విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ఉండడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి కూడా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నారని , సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేయడం కంటే ముందుగా ఆయనే ఇల్లు ఖాళీ చేసి ఉంటే ఈ రచ్చ జరిగి ఉండేది కాదని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: