జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లోమీడియాకు ఎంత అక్కసుందో మరోసారి బయటపడింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో 65వ ప్యాకేజి పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. ఆ పనులను మ్యాక్స్ ఇన్ ఫ్రా కంపెనీ 15.6 శాతం తక్కువ కోట్ చేసి వర్కును దక్కించుకుంది. అంటే రివర్స్ టెండరింగ్ విధానంలో జగన్ మొదటి అడుగే సూపర్ సక్సెస్ అయినట్లు లెక్క.

 

 అంటే 274 కోట్ల రూపాయలు కోట్లు విలువైన ఇదే వర్కును ఇదే మ్యాక్స్ ఇన్ ఫ్రా కంపెని చంద్రబాబు నాయుడు హయాంలో 4.77 శాతం అధిక ధరలను కోట్ చేసి వర్కును దక్కించుకుంది. మరి జగన్ హయంలో మాత్రం 15.6 శాతంకు తక్కువకే చేస్తానని ఎలా ఒప్పుకున్నది ? అప్పట్లో వేసిన ఎక్సస్ ధర, ఇప్పటి తక్కువ ధర మొత్తం చూస్తే సుమారు 20 శాతం ప్రజాధనం మిగిలినట్లే లెక్క. అంటే రూ. 274 కోట్ల వర్కులో ప్రభుత్వానికి సుమారు 58 కోట్లు మిగిలినట్లే కదా ?

 

దీన్నే చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియా కూడా తట్టుకోలేకుంది. రివర్స్ టెండర్ సక్సెస్ అయినట్లు కథనాలు ఇవ్వాల్సిన ఎల్లోమీడియా అలా చేయలేదు. రివర్స్ టెండర్ పై చంద్రబాబు గురువారం చేసిన ఆరోపణలనే ప్రముఖంగా ప్రచురించి రివర్స్ టెండర్ సక్సెస్ ను చాలా చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించింది. అంటే రివర్స్ టెండర్లో జగన్ సక్సెస్ అయ్యారంటే చంద్రబాబు అవినీతిని ఒప్పుకున్నట్లే.

 

అందుకనే జగన్ సక్సస్ ను ఎల్లోమీడియా అంగీకరించటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు.  రివర్స్ టెండర్లో జగన్ వేసిన మొదటి అడుగు సక్సస్ అవ్వటాన్ని ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోందని అర్ధమైపోతోంది. ప్రజాధనం ఆదా అయ్యిందని చెప్పాల్సిన ఎల్లోమీడియా పాత కంపెనీకే పనులు దక్కాయని చెప్పటంలోనే దాని ఏడుపు అర్ధమైపోతోంది. అధికారంలో ఉన్నది చంద్రబాబా లేకపోతే జగనా అని కాదు చూడాల్సింది. ఎవరైనా చేయాల్సింది ప్రజాధనం ఆదానే. ఆ పనినే జగన్ ఇపుడు చేసింది. దాన్ని కూడా చంద్రబాబు, ఎల్లోమీడియా అంగీకరించలేకపోతున్నాయంటే ఏమనుకోవాలి ?


మరింత సమాచారం తెలుసుకోండి: