తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు ఎలాంటి స్పందన ఇవ్వకపోగా ఆ నోటీసులకు ఇంటి యజమాని రమేష్ వివరణ ఇచ్చారు. అయితే లింగమనేని రమేష్ వివరణ సంతృప్తికరంగా లేదని సీఆర్డీఏ నోటీసులలో పేర్కొంది.      


కాగా గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌లోని డ్రెసింగ్‌ రూమ్‌.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు నోటీసులలో పేర్కొన్నారు. ఆ నోటీసులను చంద్రబాబు ఇంటి గోడకు అధికారులు నోటీసులు అంటించారు. వారం రోజుల్లో ఇల్లు కాళీ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.              


రోజుకో కొత్త డ్రామాతో ఆంధ్ర ప్రదేశ్ కొత్త ప్రభుత్వాన్ని కష్టాలపాలు చేస్తున్న చంద్రబాబు గతంలో ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా సమయంలో ప్రజలు బాధపడుతున్నారు అని చెప్పడానికి పెయిడ్ ఆర్టిస్టులతో 'నువ్వు ఓడిపోయావు ఏమిటయ్యా' అని అనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు అయన ఉంటున్న నివాసాన్ని కాళీ చెయ్యమని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. దింతో చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులతో మళ్ళి డ్రామాలు స్టార్ట్ చేస్తాడని 'నువ్వు ఓడిపోయావు ఏమిటయ్యా' అనే డైలాగ్ ను 'నిన్ను ఇల్లు కాళీచెయ్యమంటున్నారు ఏమిటయ్యా' అనే డైలాగ్ తో ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు.. ఈ డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.                                    


మరింత సమాచారం తెలుసుకోండి: