టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. కరకట్ట పై ఉన్న ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరకట్ట పై ఉన్న చంద్రబాబు ఉంటున్న ఇంటిని  కూడా కూల్చడానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయితే కావాలని తనపై కక్ష సాధించడానికి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కాగా  అమరావతిలో చంద్రబాబు ఉన్న ఇంటికి మరోసారి అధికారులు నోటీసులు అందించారు. గతంలో ఇచ్చిన నోటీసులకి  ఇంటి యాజమాని లింగనేని ఇచ్చిన వివరణ sarugga లేదని  అధికారులు అంటున్నారు. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్,  ఫస్ట్ ఫ్లోర్, అన్ని సిఆర్టిఏ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. అందువల్లే అక్రమ  కట్టడం గా నిర్ధారించి నోటీసులు జారీ చేసినట్లు సిఆర్టిఏ  అధికారులు పేర్కొన్నారు. 

 

 

 

 అయితే తాజాగా మరోసారి ఇంటి యజమాని లింగమనేని పేరుతో చంద్రబాబు ఇంటి గోడకి  అధికారులు నోటీసులను అతికించారు. వారంలోగా చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాలని లేకపోతే తదుపరి చర్యలకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కరకట్ట వెంబడి నిర్మిస్తున్న మిగిలిన వాళ్ళు మాత్రం హైకోర్టు నుంచి తెచ్చుకోగా ... చంద్రబాబు ఉంటున్న ఇల్లుకు  మాత్రం కోర్టు స్టే  తెచ్చుకోలేదు. దీంతో వారంలోగా చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై చంద్రబాబు,  ఇంటి యజమాని లింగమనేని ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. కాగా గతంలో కరకట్ట పై చంద్రబాబు ఇళ్ళు పై  డ్రోన్ కెమెరాలు తిరగడంతో రాష్ట్రంలో పెను దుమారమే రేగింది. మరి వారంలోగా చంద్రబాబు ఇంటిని కాలి  చేయకపోతే అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో దీనిపై రాష్ట్రంలో ఎలాంటి రచ్చ జరుగుతుందో చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: