నరమల్లి శివప్రసాద్ పేరు చెప్తే అందరికి గుర్తుకు వచ్చేది పార్లమెంట్ గాంధీ విగ్రహం దగ్గర విచిత్రమైన  వ్యక్తి.  అయన ఏ రోజు ఎలాంటి వేషం వేసుకొని పార్లమెంట్ కు వస్తారో ఎవరికీ తెలియదు.  ఎంపీ హోదాలో ఉండి.. ఎలాంటి బెరుకు లేకుండా..  అందరిలా కాకుండా ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకమైన గెటప్ లో పార్లమెంట్ వద్దకు వచ్చి హోదాకోసం పోరాటం చేసేవారు.  తెలుగుదేశం పార్టీ నాయకులు మాములుగా విగ్రహం దగ్గర ప్లకార్డులు ప్రదర్శిస్తే.. శివప్రసాద్ మాత్రం తంబూరా పుచ్చుకొని పాటలు పాడుతూ హోదా కోసం పోరాటం చేసేవారు.  


మహిళా గెటప్ లో వచ్చి కేంద్రాన్ని విమర్శించేవారు.  చేతగాని ప్రభుత్వం అని విమర్శించేవారు.  తనలాగా చీరకట్టుకొని రావాలని విమర్శలు చేసేవారు.  ఒక్కోసారి శ్రీకృష్ణుడిలా మారిపోయి.. హస్తినలోని సభకు వచ్చేవాడు.  ముస్లిం వేషంలో వచ్చి అందరిని హత్తుకుంటూ హోదా కోసం పోరాటం చేయాలనీ డిమాండ్ చేసేవారు.  అయన వేశాలన్నింటిలోకి కాటికాపరి వేషం అందరిని ఆకట్టుకుంది. 


అందరికి సుపరిచితమైన వేషం అది.  పొడవైన జుట్టు తగిలించుకొని, భుజంపై ఓ గొంగళి, చేతిలో ఒక కర్ర, భుజంపై కుండ పెట్టుకొని పార్లమెంట్ కు వచ్చి నిరసనలు తెలిపిన రోజులు ఉన్నాయి.  ఆ వేషంలో అక్కడి వచ్చి... కాటికాపరి పద్యాలు పాడుతూ ఆకట్టుకున్నాడు.  ఇలాంటి వేషాలు వేయడంలో అయన దిట్ట.  అందుకే ఆయనంటే అందరికి అభిమానం గౌరవం ఉన్నాయి.  పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అయన పార్లమెంట్ ఆవరణలో కనిపించకపోతే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగేవారట.  


శివప్రసాద్ ఈరోజు రాలేదేంటి.. ఎందుకు అని ప్రశ్నించేవారట.  దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.  శివప్రసాద్ ఎలాంటి వ్యక్తో. శివప్రసా అటు సినిమా రంగంలోనూ రాణించారు.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగారు.  చిన్నతనంలో నాటకాలు వేసిన అనుభవం ఉండటంతో శివప్రసాద్ కు సినిమా అవకాశాలు వచ్చాయి.  వృత్తి పరంగా వైద్యుడే అయినప్పటికీ .. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ రాణించారు.  అయన లేరన్న వార్త ఆయన్ను అభిమానించే పార్లమెంట్ నాయకులను విషాదంలో నింపింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: