ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించి ఒ పది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసి రికార్డు సృష్టించాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ పరీక్షల విడుదలై అభ్యర్థులందరూ మంచి ఫలితాలు సాధించారు. కాగా గ్రామ సచివాలయ పరీక్ష పేపర్లు లీకేజ్ అయ్యాయి  అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు  దిగాయి. దీంతో ఏపీలో కొత్త రగడ మొదలైంది . టిడిపి అధినేత చంద్రబాబు ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లక్షా 26 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్... ఒక్క ఉద్యోగానికి  5 లక్షల దండుకొని  పేపర్ లీకేజ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు

 

 

 

 అయితే దీనిపై స్పందించిన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి చంద్రబాబుకు ఘాటుగా సమాధానమిచ్చారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని... మీ అనుకూల మీడియా తో ఎగ్జామ్స్ సెంటర్ల చుట్టూ తిరిగారు... కానీ ఎవరు తప్పు పట్టలేదు. చివరకు తమరే  పూనుకొని ప్రశ్నాపత్రం లీక్ అయింది అని గొల్లిమనటం  ఊహించిందే  కదా నారా చంద్రబాబునాయుడు గారు.. మీలాంటి గొప్ప జ్ఞాని అలా అనకపోతే ఆశ్చర్యపోవాలి గాని అంటే ఆశ్చర్యపోవడం ఏంటి అని  ఘాటుగా విమర్శించారు విజయసాయిరెడ్డి. 1983లో అధికారంలోకి వచ్చాక టీచర్ గా ఎంపికైన వారికి 398 రూపాయల వేతనం ఇచ్చే ఏళ్లతరబడి హింసించింది   మీ ప్రభుత్వం కాదా ప్రశ్నించారు. ఇప్పుడు నాలుగు లక్షల మందికి  గ్రామ సచివాలయ ఉద్యోగుల ఇస్తుంటే నారా చంద్రబాబునాయుడు ముఠా  కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని... అందుకే శాడిస్టిక్  సెటైర్లు వేస్తుందని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: