డాక్టర్ నరమల్లి శివప్రసాద రావు గురించి తెలియని తెలుగు వ్యక్తి బహుశా ఉండరు.  వివిధ రంగాల్లో అయన రాణించారు. చదువులో మెరుగైన ఫలితాలు సాధించిన శివప్రసాద రావు.. ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఎంబిబిఎస్ చేశారు.  వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ అయన చిన్నతనం నుంచి నాటకాలు వేయడం వలన డాక్టర్ వృత్తిని చేపట్టిన తరువాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి.  1983లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన ఖైదీ సినిమాలో అవకాశం వచ్చింది.  


ఆ సినిమా అవకాశం వచ్చిన తరువాత వరసగా అక్కడి నుంచి సినిమా రంగంలో ఉంటూ సినిమాలు చేయడం మొదలుపెట్టారు.  యముడికి మొగుడు, మాస్టర్ కాపురం, యమగోల మళ్ళీ మొదలైంది, ఆడవాళ్లకు ఆదివారం సెలవు, పవన్ కళ్యాణ్ బాలు, జైచిరంజీవ వంటి ఎన్నో చిత్రాల్లో అయన యాక్ట్ చేశారు.  ప్రతి సినిమా ఆయనకు ఓ గుర్తింపు తెచ్చింది.  వరసగా సినిమాలు చేస్తూ మెప్పించిన శివప్రసాదరావుకు 1999లో రాజకీయాల నుంచి పిలుపు రావడంతో అటువైపు వెళ్లారు.  


రాజకీయ రంగంలో అవకాశం దక్కించుకున్న డాక్టర్ శివప్రసాదరావు, 1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  మొదటిసారి పోటీ చేసి విజయం సాధించిన శివప్రసాదరావు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సమాచార సాంస్కృతికశాఖ మంత్రిగా పనిచేశారు. 2009అనంతరం లో చిత్తూరు నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి విజయం సాధించారు.  సినిమా రంగంలో అయన వేషాలు చాలా విచిత్రంగా ఉంటాయి.  


క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆయన ఎక్కువ సినిమాల్లో నటించారు. ఏ పాత్ర వేసినా ఆయన అందులో పరకాయ ప్రవేశం చేసి నటించేవారు.  చేసిన పాత్రకు పేరు తీసుకొచ్చేవారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికి సుపరిచితమయ్యారు శివప్రసాద్.  సయ్యాట అయన నటించిన చివరి సినిమా.  ఆ తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యారు.  2014 కు ముందు రాష్ట్రం విడిపోవడం.. ఆ తరువాత కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో ఆ పనుల్లో అయన బిజీ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: