టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మరణించారు. ఈ నెల 12 న శివప్రసాద్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటి నుంచి డయాలసిస్‌ చేస్తుండగా ఈరోజు చికిత్స పొందుతూ మృతిచెందారు.                        


దీంతో ఒకే వారంలో ఇద్దరు సీనియర్ టీడీపీ నేతలను అదికూడా ఇద్దరు శివప్రసాద్ లను కోల్పోయింది తెలుగు దేశం పార్టీ. శివ ప్రసాద్ మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. చంద్రబాబు నిన్న సాయింత్రమే చెన్నై ఆసుపత్రికి వెళ్లి శివ ప్రసాద్ ని పరామర్శించారు. ఇంతలో ఈరోజు అయన మరణించారు.                  

            

ఎలాంటి సమస్యని అయినా అతను సినీ నేపథ్యంలోనే వివిధరకాల వేషధారణలతో నిరసనలు తెలిపేవారు. ఏ సమస్య వస్తే ఆ సమస్యకు తగ్గట్టు వేషధారణ చేసుకొని నిరసనలు చెయ్యడం వల్ల ఆ సమస్యలు వెంటనే పరిష్కారమైయ్యేవి. అలాంటి మహానేతను కోల్పోవడం సినీ రాజకీయ రంగాలకు తీరని లోటు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శివ ప్రసాద్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. శివప్రసాద్ కుటుంబానికి జగన్ ప్రగాఢసానుభూతి తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. నారా లోకేష్, కేశినేని నాని, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ శివ ప్రసాద్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.                                   


మరింత సమాచారం తెలుసుకోండి: