రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడున్న ప‌రిస్థితికి అనుగుణంగా అప్పుడు ప‌థ‌కాన్ని, వ్యూహా న్ని మార్చుకుంటూ.. ముందుకు పోవ‌డ‌మే రాజ‌కీయ నేత‌ల ముందు చూపున‌కు, ప్ర‌త్య‌ర్థుల ఆట‌క‌ట్టించేం దుకు రాజ‌కీయ అస్త్రాలు అవుతుంటాయి. ఇలాంటి వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాలు, ప్ర‌త్య‌ర్థుల‌ను త‌న‌కు అనుకూలం గా మార్చుకోవ‌డంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే తెలంగాణ ర‌థ‌సార‌ధి, టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ మ‌రోసారి వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. గ‌త డిసెంబ‌రులో జ‌రిగిన రాష్ట్ర అసెం బ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌దైన శైలిలో అప్ప‌టి మ‌హాకూట‌మిగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీల‌ను సైతం మ‌ట్టిక‌రిపించా రు.


నిజానికి అప్ప‌ట్లో ఇలాంటి ప‌రిస్థితి నుంచి కేసీఆర్ త‌న‌ను తాను ర‌క్షించుకోలేర‌నే వ్యాఖ్య‌లు వినిపించా యి. కానీ, ఆయ‌న అనూహ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని యూట‌ర్న్ తీసుకున్నారు. చంద్ర‌బాబు తెలంగాణ ఎన్నిక ల్లో ఎంట‌ర్ కానంత వ‌ర‌కు కూడా త‌న గెలుపుపై పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోని కేసీఆర్‌. బాబు ఎంట్రీతో ప‌రిస్తితిని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ఇప్పుడు కూడా ఇదే త‌ర‌హాలో పాత న‌ల్ల‌గొం డ జిల్లాలోని హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక విష‌యంలోనూ వ్యూహానికి తెర‌దీశారు.


ఇక్క‌డ నుంచి గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున సైదారెడ్డి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన ఉత్త‌మ్ విజ‌యంసాధించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన పార్ల మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఆయ‌న విజ‌యం సాధించ‌డంతో.. హుజూర్‌న‌గ‌ర్‌ను వ‌దులుకోవాల‌ని నిర్ణ యించుకున్నారు. దీంతో ఇప్పుడు ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.


అయితే, ఇక్క‌డ త‌న కుమార్తెను నిల‌బెట్టుకుని విజ‌యం ద‌క్కించుకోవాల‌ని వ్యూహం ప‌న్నిన కేసీఆర్‌.. త‌న‌దైన శైలిలో కాంగ్రెస్‌లో కుంప‌ట్లు రేపార‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. కాంగ్రెస్ నాయ‌కులు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్త‌మ్‌లు ఈ టికెట్‌కేటాయింపు విష‌యంపై త‌లోమాట మాట్లాడుతున్నారు. త‌న భార్యకు టికెట్ ఇప్పించుకోవాల‌ని ఉత్త‌మ్ భ‌విస్తున్నారు. అయితే, రేవంత్ మ‌రో వ్య‌క్తిని ఇక్క‌డ రం గంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇలా మొత్తంగా తీవ్ర గంద‌ర‌గోళం ఏర్ప‌డి నేత‌ల మ‌ధ్య విభేదాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.


వాస్త‌వానికి కేసీఆర్‌, కేటీఆర్ అండ్ కోలకు కావాల్సింది ఇదే. ఇలా వ్యూహాత్మ‌కంగా కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టి.. అంతా గంద‌ర‌గోళంగా ఉన్న స‌మ‌యంలో ఇక్క‌డ పాగా వేయాల‌నేది టీఆర్ ఎస్ ప్లాన్‌గా భావిస్తున్నారు. దీనికి సంబంధించి క‌ర్త‌క‌ర్మ అంతా కూడా టీఆర్ ఎస్ భ‌వ‌న్ నుంచే ప్రారంభ‌మైంద‌ని, కొంద‌రు సానుకూల మిత్రుల ద్వారా రేవంత్‌ను ఈ టికెట్ విష‌యంలో రెచ్చ‌గొట్టింది కూడా టీఆర్ ఎస్ కీల‌క నాయ‌కులేన‌ని తాజాగా వెలుగు చూసింది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో చూడాలి. ఏదేమైనా.. టీఆర్ ఎస్ వ్యూహంలో కాంగ్రెస్ చిక్కుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: