Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 11:09 am IST

Menu &Sections

Search

హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలుపు అస్త్రం ఇదే..!

హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలుపు అస్త్రం ఇదే..!
హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలుపు అస్త్రం ఇదే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి హుజుర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకే మరోసారి సీఎం అవకాశమిచ్చారు. గ‌తంలో ఓట‌మి చెందిన సానుభూతి సైదిరెడ్డికి అక్క‌ర‌కు వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో మ‌రోమారు కేసీఆర్ సైదిరెడ్డి వైపు మొగ్గు చూపిన‌ట్లు తెలిసింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల న‌గ‌రాను మోగించింది.


పీసీసీ అద్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నల్ల‌గొండ ఎంపీగా గెల‌వ‌డంతో  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అక్టోబరు 21న పోలింగ్‌ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.పీసీసీ అధ్య‌క్షుడు, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య‌ ప‌ద్మావ‌తి ని హుజూర్‌న‌గ‌ర్ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్నది. ఇక టీఆర్ ఎస్ నుంచి సైదిరెడ్డి ఎంపిక కావ‌డంతో ఇక క‌మ‌లం నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో తేలాల్సి ఉంది. బీజేపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే హుజూర్‌న‌గ‌ర్‌లో ముక్కోణపు పోటీ త‌ప్ప‌దు.


అయితే ఇక్క‌డ కాంగ్రెస్‌కు, టీ ఆర్ ఎస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇక్క‌డ పాగా వేయాల‌ని గ‌తంలోనే టీ ఆర్ ఎస్ ప్ర‌య‌త్నాలు  చేసింది. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాల‌ని కేసీఆర్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని ఓడించ‌డం కేసీఆర్ వ‌ల్ల కాలేక‌పోయింది. ఇక టీ ఆర్ ఎస్‌కు హుజూర్ న‌గ‌ర్‌లో స్థానం లేద‌ని నిర్ణ‌యించుకునే స‌మ‌యంలోనే ఉప ఎన్నిక వ‌రంగా మారింది. ఇక్క‌డ పీసీసీ అధ్య‌క్షుడి భార్య‌ను ఓడిస్తే నైతికంగా కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టొచ్చ‌ని కేసీఆర్ పావులు క‌దుపుతున్నాడ‌ట‌.


అందుకే అభ్య‌ర్థిని మార్చ‌కుండా గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ చేతిలో ఓడిపోయిన సైదిరెడ్డినే బ‌రిలోకి దింపుతున్నారు. సైదిరెడ్డి గ‌తంలో ఓడిపోయాడ‌నే సానుభూతి ఈ ఉప పోరులో లాభించ‌నున్న‌ద‌ని టీ ఆర్ ఎస్ వ‌ర్గాల క‌థ‌నం. ఇక ఇక్క‌డ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డికి ఈ ఎన్నిక మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో ఈ సీటుపై అటు రేవంత్‌రెడ్డి వ‌ర్గం క‌న్నేసింది. దీంతో కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు భ‌గ్గుమంటున్న త‌రుణంలో ఇటు ఇంటిపోరు బాగానే ఉంది. మ‌రోవైపు టీ ఆర్ ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్య‌ర్థి సైదిరెడ్డి బ‌రిలో ఉండ‌టంతో సానుభూతి ప‌వ‌నాలు వీస్తాయ‌నే భ‌యం ఉత్త‌మ్‌కు పట్టుకుంది.


ఓవైపు సొంత పార్టీలో కుంప‌టి.. మ‌రోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థి. ఈ రెండింటిని త‌ట్టుకుని ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి త‌న భార్య‌ను ఎలా గెలిపించుకుంటాడో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ ఎన్నిక ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజ‌కీయ జీవితానికే ఓ ఆగ్నిప‌రీక్ష లాంటిది. అయితే ఇంత‌కు ముందు త‌న భార్య ప‌ద్మావ‌తిని కోదాడ నుంచే గెలిపించుకోలేక పోయిన ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు త‌న సొంత ఇలాఖాలో ఎలా గెలిపించుకుంటాడో వేచి చూడాల్సిందే. ఇక బీజేపీ కి ఇంకా బ‌ల‌మైన అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. బీజేపీ ఈ ఉప పోరులో త‌న స‌త్తా చాటాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేయనున్న‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ త్రిముఖ పోటీలో స‌త్తా ఎవ‌రిదో ఏంటో అక్టోబ‌ర్ 24న తేల‌నున్న‌ది.



trs success in huzurnagar telangana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉత్త‌మ్ ఉద్వాస‌న‌కు రంగం సిద్ధం.... ఆ మాట‌ల అర్థం అదే...
చిన్న‌బాబు చిల‌క ప‌లుకుల‌పై సెటైర్ల వ‌ర్షం..!
జ‌గ‌న్ అది చేస్తే బాబోరికి ఓట్లు నిల్‌... సీట్లు నిల్‌..!
దగ్గుబాటి వైసీపీలో తట్టా... బుట్టా సర్దేసుకోవచ్చు....
వైసీపీలోకి గంటా ఎంట్రీ.. అవే అడ్డంకులా...?
ఏపీలో అవినీతి మాట ఎందుకు విన‌ప‌డ‌డం లేదు...
ఏపీలో ఉద్యోగాల జాత‌ర‌... నిరుద్యోగానికి జ‌గ‌న్ మార్క్ చెక్‌
అదే బాట‌.. అదే మాట‌.. జ‌గ‌న్ పాల‌న‌కు వాళ్లంతా ఫిదా...
' గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ' క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌
జగన్ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో...కట్టిందెవరంటే..?
రైతు భ‌రోసా పేరు మార్పు వెనుక‌.. అస‌లేం జ‌రిగిందంటే..?
క‌ర్నాట‌క సీఎంకు షాక్ ఇచ్చిన ఎలుక
టీడీపీ కంచుకోటలో జగన్ వ్యూహం అదుర్స్....
బాబు ఇలాఖాపై జగన్ కన్ను... అదిరిపోయే వ్యూహం
జ‌గ‌న్‌ను జైలుకు పంప‌డం స‌రేకానీ... త‌మ్ముళ్ల‌ను కాపాడుకో బాబు...!
లోకేష్ బాబు దుబారా మామూలుగా లేదుగా..
ప్లాన్ స‌క్సెస్‌: జగన్‌కు ఆ ఇద్ద‌రి అండ దొరికేసింది
చిరు - జ‌గ‌న్‌ను క‌లిపింది ఈ నెంబ‌రేగా..!
విశాఖ టీడీపీలో భారీ క‌ల‌క‌లం... సీనియ‌ర్ నేత జంప్‌..!
ఎర్ర‌బెల్లి కాదు ఊస‌ర‌వెల్లి...!
చిరు - జ‌గ‌న్ మ‌ధ్య ఏం జ‌రిగింది... జ‌గ‌న్ ఓకే చెప్పారా...!
సీఎం జ‌గ‌న్‌తో భేటీకి రామ్ చ‌ర‌ణ్ డుమ్మా వెన‌క‌..!
టీఆర్ఎస్‌లో ఆర్టీసీ చిచ్చు ... ఏం జ‌రుగుతోంది..!
ఆర్టీసీ స‌మ్మె... కేసీఆర్ కొత్త ఎత్తుగ‌డ‌...!
కార్మికుల బెట్టుతో మెట్టు దిగిన కేసీఆర్‌...
బ్రేకింగ్‌: ఏపీలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు అదిరిపోయే న్యూస్‌
ఆ తప్పు సరిచేసుకుంటే జగన్‌కు తిరుగుండదేమో...
వైసీపీతో వార్‌కు బాబు టీం రెడీ...
కృష్ణాలో కీల‌క ఎమ్మెల్యేల మౌనం.. రీజ‌నేంటి...?
బీజేపీలో రాం మాధ‌వ్‌ను ప‌క్క‌న పెట్టారా... ఏం జ‌రుగుతోంది...!
‘వైఎస్సార్ వాహనమిత్ర’ సూపర్ హిట్.. రెస్సాన్స్ ఏ రేంజ్‌లో అంటే...
టీడీపీ బలమే జగన్ టార్గెట్...
జ‌గ‌న్ దెబ్బ‌కు క‌మ‌లం గూటికి వైసీపీ సీనియ‌ర్‌..!
జగన్ అసలు టార్గెట్ ఇదే... బీజేపీకి ఎర్త్ ఇలా...
బాబు త‌ర‌హాలో జ‌గ‌న్ వ్యూహం.. దెబ్బ‌తింటారేమో...!
హాట్ ఫైట్‌: మ‌హేష్ వ‌ర్సెస్ బ‌న్నీ.. మ‌ధ్య‌లో నంద‌మూరి హీరో
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.