తెలంగాణ రాజకీయాల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది.  అని పార్టీల చూపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక వైపే. ఉప ఎన్నిక కోసం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా జరుగుతున్నాయి. అయితే హుజూర్నగర్ ఉప ఎన్నిక ని అక్టోబర్ 21న నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు కోసం పావులు కదులుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అయితే అన్ని పార్టీలు హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

 

 

 కాగా కాంగ్రెస్ టిఆర్ఎస్ లు ఇప్పటికే హుజూర్నగర్ నియోజకవర్గంలో పోటీచేసే తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన సైదిరెడ్డి కి మరోసారి ఛాన్స్ ఇచ్చింది టిఆర్ఎస్. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సైదిరెడ్డి కి ఏడాదిలోపే తన అదృష్టాన్ని పరీక్షించుకునే మరో చాన్స్ వచ్చింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతికి హుజూర్ నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే గతంలో 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ పోటీలో నిలిచి ఓటమిపాలైంది. కాగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన సైదిరెడ్డి కాకుండా తనకు హుజూర్నగర్ సీటు కేటాయిస్తారని శంకరమ్మ గుప్పెడు ఆశ పెట్టుకుందట.

 

 

కానీ టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ సైదిరెడ్డి కే  కేటాయించడంతో... హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో ఎలాగైనా నిలవాలని శంకరమ్మ ప్రయత్నాలు చేస్తుందట.ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజులు తెలంగాణలో తెరాస కి ప్రత్యామ్నాయం మేమే అంటూ చెప్పుకుంటున్న బీజేపీ  ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని శంకరమ్మ కు హుజూర్ నగర్ ఉప ఎన్నిక సీటు కేటాయిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ అంశం అధికార టీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: