ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రలోని వరద భాదితులకు శుభవార్త చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లోని వరద భాదితులకు అదనపు సాయం తోపాటు సొంత ఇల్లు కట్టిస్తామని సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేతిలోకి వచ్చినప్పటి నుండి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ఆంధ్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు వైఎస్ జగన్. 


అతని పరిపాలనతో రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నాడు వైఎస్ జగన్. ప్రతిపక్షాలు ఎన్నిసార్లు విమర్శలు చేసిన పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ముఖ్యమంత్రిగా పేరొందారు. గత 9 సంవత్సరాలుగా ఆంధ్రాలో వర్షాలు లేక పంటలు పండక ప్రభుత్వం సహాయం చెయ్యక అష్టకష్టాలు పడ్డారు రైతులు. కానీ ఈసారి జగనన్న వచ్చాడు అనో ఏమో రాయలసీమలో కూడా వర్షాలు ఏకధాటిగా కురిశాయి. 


 ఈ నేపథ్యంలోనే ఈరోజు నంద్యాలలో నెలకొన్న వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కృష్ణా ఆయకట్టు, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ తెలిపారు. 


భవిష్యత్తులో రాయలసీమలోని ప్రతి డ్యామును నీటితో నింపుతామని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు నంద్యాలలో చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణానికి చర్యలు ప్రారంభించారని.. అవి మధ్యలోనే ఆగిపోయానని వాటిని త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని జగన్ స్పష్టం చేశారు. కాగా వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని.. సాధారణంగా ఇచ్చే వరద సాయం కంటే ప్రతి ఇంటికి అదనంగా రూ.2 వేలు ఎక్కువ ఇస్తామని, వరద బాధితులుందరికి ఇళ్లు కట్టిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: