అందుకే తెలుగుదేశం తమ్ముళ్లు , చంద్రబాబు నాయుడు  పోలవరం  రీ టెండరింగ్ విధానం అంటేనే మండిపడ్డారు, భయపడ్డారని వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తీవ్రంగా  శైలజ చరణ్ రెడ్డి  దుయ్యబట్టారు. అయిదేళ్ల పాలనలో చంద్రబాబు, ఆయన ముఠా దోచుకున్న సొత్తు అంతా ఇంతా కాదన్నారు. పోలవరం, రాజధాని, పట్టిసీమ, భవన నిర్మాణాల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేశారని తేటతెల్లమైందన్నారు. పోలవరం రీ టెండరింగ్ తో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడిందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో ప్రభుత్వానికి రూ. 58.53కోట్లు ఆదా కానుందని అంటే దాదాపు 20  శాతం తక్కువ కు మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ  పని చేయడానికి ముందుకొచ్చింది. అదే బాబు  హయంలో జరిగిన 11  వేల కోట్ల మేర పోలవరం పనుల్లో 20  శాతం అంటే  2  వేల కోట్ల పైనే అవినీతి జరిగినట్టు తెలుస్తోందన్నారు. ఒక్క పట్టిసీమలోనే నాలుగువందల కోట్ల మేర అవినీతి జరిగిందని నాడు కాగ్ సంస్థ ఘాటుగా వివరించిందన్నారు.  అమరావతిలో అంతా అవినీతే అని, లంచాలు ఇవ్వనిదే పనులు కావని రాజధాని డిజైన్స్ లో పాలుపంచుకున్న జపాన్ సంస్థ మాకీ కుండబద్దలు కొట్టిందని అమె గుర్తుచేశారు. 



పోలవరం, విద్యుతు ఒప్పందాలు..ఏ ఒప్పందాల్లో అయినా నలభై శాతం అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ నలభై శాతం అక్రమధనం టిడిపి నాయకుల జేబుల్లోకి వెళ్లిందనేది బహిరంగ రహస్యమన్నారు.  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత  పోలవరం, విద్యుత్ ఒప్పందాల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని ప్రకటించారన్నారు.  నిజానికి ఈ రివర్స్ టెండరింగ్ విధానం గతంలో జరిగిందో లేదో తెలియదు గానీ, నేనైతే తొలిసారి విన్నానని చెప్పారు.  ఈ విధానం పట్ల జగన్ ఎంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నారో నిన్నటి పోలవరం ప్రాజెక్టు రీ టెండర్ ద్వారా స్పష్టమైందన్నారు.   జగన్ ఈ విధానాన్ని ప్రకటించగానే చంద్రబాబు, ఆయన ముఠా కలవరంలో మునిగిపోయారన్నారు.  ఏదో ప్రళయం వస్తుందన్నంతగా గలాభా సృష్టించారు.  రాష్ట్రం వెనక్కు పోతుందన్నారు.  పారిశ్రామికవేత్తలు రారన్నారు.  ఎవరెన్ని చెప్పినప్పటికీ సీఎం జగన్ తన పట్టు వీడలేదన్నారు.  దాంతో బీజేపీలోని తన బానిసలతో విమర్శలు చేయించారని విమర్శించారు ముక్కు మొఖం తెలియని మోహన్ దాస్ పాయ్ అనే వ్యక్తి  కర్ణాటక నుంచి జగన్ ను విమర్శించడాన్ని అఖేపించారు. అంతేకాకుండా జపాన్ నుంచి ఎవరో  కేంద్ర ప్రభుత్వానికి, జగన్ కు కూడా లేఖ రాయడం విడ్డురమన్నారు. కేంద్ర మంత్రులు, కార్యదర్సులు కూడా జగన్ ను హెచ్చరిస్తూ లేఖలు రాశారు.  అయినప్పటికీ జగన్ పట్టు విడవకుండా ముందుకే సాగిపోయారన్నారు. 




నిన్నటి ఒకే ఒక్క టెండర్ లో పోలవరం 65  వ ప్రాజెక్టు  పనులకు తొమ్మిది నెలల క్రితం చంద్రబాబు అధికారంలో ఉండగా మాక్స్ ఇన్ఫ్రా సంస్థ కోట్ చేసినదానికన్నా సుమారు అరవై కోట్ల రూపాయల తక్కువ మొత్తానికి టెండర్ దక్కించుకున్నదంటే ఆ అరవై కోట్ల రూపాయలు చంద్రబాబు జేబులోకి పోయిన డబ్బు కాదా అని ప్రశ్నించారు.  అప్పట్లో అడ్వాన్స్ గా ఇచ్చిన లంచాన్ని ఆ సంస్థ వదులుకుని కూడా మళ్ళీ ఇంత తక్కువ ధరకు కోట్ చేసిందంటే, ఇక మొత్తం పోలవరం టెండర్లు లో ఎన్ని వేలకోట్ల రూపాయల దోపిడీ జరిగేదో ఆలోచించుకోవాలన్నారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడు పదిహేను వేలకోట్ల రూపాయలుగా ఉన్న అంచనా వ్యయం రాత్రికి రాత్రే యాభై ఎనిమిదివేల కోట్ల రూపాయలకు ఎగబాకిందంటే అందులో చంద్రబాబు చాణక్యం సామాన్యమైనది కాదన్నారు.  ఒక్క చిన్న కాంట్రాక్టులోనే ప్రభుత్వానికి అరవై కోట్ల రూపాయలు మిగిలాయంటే, ఇక మిగిలిన ప్రాజెక్టులు, పీపీఏలో రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేస్తే కనీసం లక్ష కోట్లు ఆదా అవుతాయొనన్నారు .  ఆ డబ్బుతో జగన్ నవరత్నాలలాంటివి పాతిక సంక్షేమ పధకాలను అమలు చెయ్యవచ్చన్నారు. సీఎం జగన్ ధైర్యానికి, సాహసానికి,  నిజాయితీకి ప్రజల సంక్షేమం గురించి  ఆలోచించే విధానానికి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: