చిత్తూరు మాజీ ఎంపీ డాక్ట‌ర్  నార‌మ‌ల్లి శివ‌ప్ర‌సాద్ మృతిని మాజీ సీఎం నారా చంద్ర‌బాబు జీర్ణించుకోలేక పోతున్నారు. శివ‌ప్ర‌సాద్ మృతి చెందాడ‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు శోఖ‌సంద్రంలో మునిగిపోయాడు. టీడీపీకి చెందిన కీల‌క నేత‌గా, మాజీ ఎంపీగా ప‌నిచేసిన శివప్ర‌సాద్ మృతి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్ర‌బాబుకు తీర‌ని లోటే అని చెప్ప‌వ‌చ్చు.. చిన్ననాటి నుంచి చ‌నిపోయేవ‌రకు న‌మ్మ‌కంతోనే ప‌నిచేసిన శివ‌ప్ర‌సాద్ చంద్రబాబు క్లాస్‌మెట్ అంటే న‌మ్మ‌క‌శ్యం కాదు. కాని ఇది నిజం. అందుకే చిన్న‌నాటి మిత్రుడు శివ‌ప్ర‌సాద్ చ‌నిపోవ‌డం చంద్ర‌బాబులో ఎక్క‌డ‌లేని విషాదాన్ని నింపింది.


టీడీపీ అధినేత, మాజీ ఎంపీ చంద్ర‌బాబుకు నార‌మ‌ల్లి శివ‌ప్ర‌సాద్ హైస్కూల్‌లో క్లాస్‌మెట్స్‌. శివప్రసాద్ 1951 జులై పదకొండున నాగయ్య, చెంగమ్మ దంపతులకు జన్మించారు. మూడో సంతానం అయిన శివ‌ప్ర‌సాద్ చ‌దువులో, నాట‌కాల్లో ముందుండేవాడు. స్కూల్ ఏజ్ నుంచే నాట‌కాలు ఆడుతూ అల‌రించేవాడు.  శివ‌ప్ర‌సాద్ స్వ‌స్థ‌లం చంద్ర‌గిరి మండ‌లం పూటిపల్లి. ఐతేప‌ల్లిలో 5వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్న శివ‌ప్ర‌సాద్ త‌రువాత 6వ‌త‌ర‌గ‌తి నుంచి ఎస్ ఎస్ ఎల్ సీ వ‌ర‌కు చంద్ర‌గిరి ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో చ‌దువుకున్నాడు.


6వ త‌ర‌గ‌తి నుంచి చంద్ర‌గిరి ఉన్న‌త పాఠ‌శాల‌లో చ‌దువుతున్న‌ప్పుడు నారా చంద్ర‌బాబు నాయుడు కూడా శివ‌ప్ర‌సాద్‌కు క్లాస్‌మెట్‌. ఇద్ద‌రు క‌లిసి మంచి స్నేహితులుగా మెలిగేవారు. ఇద్ద‌రు క‌లిసి ఎస్ ఎస్ ఎల్ సి వ‌ర‌కు క‌లిసే చ‌దువుకున్నారు. ఇద్ద‌రు ఎంతో అన్యోన్యంగా క‌లిసి ఉండేవారు. చ‌దువుల్లో ఇద్ద‌రు దిట్ట‌లేన‌ట‌. అందుకే శివ‌ప్ర‌సాద్‌ను చంద్ర‌బాబు బాగా ఇష్ట‌ప‌డేవార‌ట‌. ఆనాటి సోప‌తి శివ‌ప్ర‌సాద్ చ‌నిపోయేంత వ‌ర‌కు విడిచిపెట్ట‌లేదు.


అందుకే చంద్ర‌బాబు త‌న మంత్రివ‌ర్గంలో 1999 నుంచి 2004 వ‌ర‌కు స‌మాచార‌, ప్ర‌సార మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు. త‌రువాత ఆయ‌న ఎమ్మెల్యేగా ఓడిపోయినా త‌రువాత ఎంపీగా టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించుకున్నారు. ఎప్పుడు చంద్ర‌బాబు జ‌పం చేసే శివ‌ప్ర‌సాద్ చ‌నిపోవ‌డంతో చంద్రబాబుకు కుడిభుజం ప‌డిపోయినంత ప‌ని అయింది. టీడీపీ కార్యాలయంలో శివప్రసాద్ చిత్రపటానికి నివాళి ఆర్పించిన చంద్ర‌బాబు  తాను, శివప్రసాద్ స్కూల్ విద్యను కలిసే చదువుకున్నట్లు గుర్తుచేశారు.


శివప్రసాద్‌ను తానే రాజకీయాల్లోకి ఆహ్వానించానన్నారు. శివప్రసాద్‌ టీడీపీకి చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ప్రజా సమస్యలపై శివప్రసాద్ తిరుగులేని పోరాటం చేశార‌ని గుర్తు చేసుకుని క‌న్నీరు కార్చారంటే ఆయ‌న‌తో చంద్రబాబుకు ఉన్న‌సాన్నిహిత్యం ఏపాటిదో అర్థ‌మ‌వుతుంది. నాటి స్నేహితుల‌తో క‌లిసి దిగిన ఫోటోను చంద్ర‌బాబు నాయుడు సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి త‌న చిన్న‌నాటి స్నేహితుడిపై చంద్ర‌బాబుకు ఎంత ప్రేమ ఉందో నిరూపిత‌మ‌వుతుంది. సో స్నేహమంటే ఇదే క‌దా...!



మరింత సమాచారం తెలుసుకోండి: