ఈ నెల 23 నుండి శాసనసభ నియోజకవర్గాల కేంద్రాలలో బతుకమ్మ చీరల పంపిణికి ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్  నుండి సి.యస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బతుకమ్మ చీరల పంపిణీ, బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ, సీజనల్ వ్యాదులు, రెవెన్యూ, అటవీ భూముల సర్వే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, యూరియా పంపిణీ , 2021 జనాభా లెక్కల సేకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. చేనేత కమీషనర్ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ 28న ప్రారంభమవుతున్నందున మహిళలు బతుకుమ్మ చీరలను ధరించాలని ఇప్పటికే జిల్లాలకు 74 లక్షల చీరలను పంపామన్నారు. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కమిటీల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. చౌకధరల దుకాణాల వారీగా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు చీరల పంపిణీపై మార్గదర్సకలను పంపామన్నారు. కమిటీలకు తగుశిక్షణను ఇవ్వాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన తెల్లకార్డు మహిళ లకు ఇవ్వాలన్నారు. అవసరమైన చోట ఎక్కువ పంపిణీ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ లో వ్యాధి నివారణ చర్యలను విస్తృతం చేయాలన్నారు. 



ప్రస్తుత సీజన్ మలేరియా , టైఫాయిడ్ , డెంగ్యూ జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి శాంతికుమారి అన్నారు. స్వైన్ ప్లూ నివారణ చర్యలను చేపట్టాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులలో ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని కలెక్టర్లు తనిఖీ చేయాలన్నారు. అవసరమైన మందులు , కిట్లు పంపుతున్నామన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా వైద్య సేవల పై సమీక్షించాలన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతె రాష్ట్ర కంట్రోల్  రూమ్ తో  సంప్రదించాలన్నారు. ఖరీప్ సీజన్ కు సంబంధించి యూరియాను జిల్లాలకు పంపామని వీటిని సక్రమంగా పంపిణీ అయ్యేలా చుడాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పార్ధసారధి కలెక్టర్లను కోరారు. జిల్లాలలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పిఎసిఎస్ , ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయాలన్నారు. అన్ని గ్రామాలలో పంపిణీ చేయాలన్నారు. జిల్లా స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమీక్షించాలన్నారు. వచ్చే రబీకి అవసరమైన ఎరువులు , యూరియా వివరాలు ఇవ్వాలన్నారు. వర్షాలు కురిసి నీటి లభ్యత ఉన్నందున మంచి పంటలు పండే అవకాశం ఉందన్నారు. జిల్లాల కలెక్టర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కాటన్ ప్రొక్యూర్మెంట్ అక్టోబరు నుండి ప్రారంభమవుతున్నందున దాదాపు 340 ప్రొక్యూర్మెంట్  సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.




జిల్లా స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా పంట వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలని పార్ధసారధి అన్నారు. సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 6వరకు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ సంస్కృతి ప్రతిబించించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో మహిళలు పాల్గొనాలన్నారు. జిల్లా స్థాయిలో ఘనంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. నిర్వాహణకు సంబంధించి కమీటీలను పంపుతున్నామన్నారు.అటవీ , రెవెన్యూ భూముల సర్వే పూర్తయి వివాదం లేని భూముల వివరాలను ఐ ఎల్ ఆర్ ఎం ఎస్ పోర్టల్  నెలలోగా నమోదు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి  సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గారు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని, ముఖ్యమైన విషయమని కలెక్టర్లు ప్రతి వారం పురోగతి నివేదికను, కార్యాచరణ ప్రణాళికను పంపాలన్నారు. సర్వేకు అవసరమైన ప్రత్యేక టీంలను పంపుతామన్నారు.




 అటవీ, రెవెన్యూ భూముల వివాదాస్పదం పై ప్రత్యేక దృష్టి సారించాలని సర్వే లేని భూములకు నెంబర్ల కేటాయిపు పై డిటైల్డ్ గైడ్లైన్స్  పంపామన్నారు. ప్రతి వారం 25 శాతం పనిని పూర్తిచేయాలన్నారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ,ఎన్ జి టి   ఆదేశాల ప్రకారం సాలిడ్ వేస్ట్ మ్యానేజిమెంట్ కు సంబంధించి మున్సిపాలిటీలలో ల్యాండ్ ఫైలింగ్ సైట్స్ ను ఎంపిక చేయాలన్నారు. అక్టోబరు నాటికి పూర్తి చేయాలన్నారు. బయో మెడికల్ వేస్ట్ ను  సైంటిఫిక్ పద్దితలో డిస్పోసల్  చేయాలనన్నారు. జిల్లాలలో అన్ని ఆసుపత్రులు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో సమీక్ష చేయాలన్నారు. ప్లాస్టిక్ సేకరణ, వాయి కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని అంశాలకు సంబంధించి పిసిబి ద్వారా ఇంస్ట్రుక్షన్స్ పంపామన్నారు.2021 జనాభ ఎన్నికల లెక్కల సేకరణకు సంబంధించి మాస్టర్ ట్రైనర్ల ను ఎంపిక చేసి లిస్టును  పంపాలని జి.ఎ.డి. ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి అధర్ సిన్హా కోరారు. వీరు ప్రత్యేకంగా ఈ అంశాన్ని పరిశీలిస్తారని అన్నారు. విల్లెజ్  రిజిస్టర్ ,  టౌన్ రెజిస్టర్స్, అర్బన్ అఙ్గలోమెరేషన్  వివరాలను వెంటనే పంపాలని ఆదేశించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: