కృష్ణా కరకట్ట అక్రమాల తొలింపుపై మరోసారి దృష్టిపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న.. ఇల్లుకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఇంతకీ చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ కూల్చివేత తప్పదా..? ఇంటి యజమాని ముందున్న ఆప్షన్స్‌ ఏంటి..?


ఉండవల్లిలోని మాజీ చంద్రబాబు నివాసం ఉండే భవనం మరోసారి చర్చల్లోకి వచ్చింది. అక్రమ నిర్మాణాన్ని ఖాళీ చేయాలంటూ సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఖాళీ చేయాలని, లేదంటే కూల్చివేస్తామని హెచ్చరించారు అధికారులు. గతంలో ఇచ్చిన నోటీసులకు సమాధానం సంతృప్తికరంగా లేదని నోటీసులలో ప్రస్తావించింది. ఇంటి యజమాని లింగమనేని రమేష్ పేరుతో నోటీసు అంటించారు అధికారులు.


మాజీ ముఖ్యమంత్రి ఉంటున్న నివాసం నిబంధనలకు విరుద్దంగా ఉందని అధికారులు గతంలోనే తేల్చారు. దీనిపై రెండు నెలల క్రితం నోటీసులు కూడా ఇవ్వగా పెద్ద దుమారం రేగింది. ఐతే తప్పు ఎవరు చేసినా నిర్ణయం ఒకేలా ఉంటుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.  ప్రజావేదికతో మొదలు పెట్టిన కూల్చి వేతలు...ఇతర అక్రమ నిర్మాణాల తొలగింపు వరకు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా రెండోసారి కూడా నోటీసు ఇవ్వడంతో ఇక కూల్చి వేత తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 


చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌... ఎకరం మూడు సెంట్లలో నిర్మించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో కొన్ని అదనపు నిర్మాణాలు చేశారు. తాజాగా ఇచ్చిన నోటీసులలో 13 అంశాలను ప్రస్తావించారు. రివర్ బెడ్‌కు 100 మీటర్లలోపు కాంక్రీట్ కట్టడాలు ఉన్న కారణంగా వాటిని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. వారంలోపు ఇంటి యజమాని నిర్మాణాల తొలగింపు పూర్తి చెయ్యకపోతే....ఆ పని తామే చేస్తామని కూడా నోటీసులో చెప్పారు. ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫోర్, స్విమ్మింగ్ పూల్, నదికి అనుకుని కట్టిన ఇతర నిర్మాణాలు, గెస్ట్ రూమ్ లు తొలగించనున్నారు. కేవలం చంద్రబాబే కాకుండా ఇతర నిర్మాణాల కూడా ఈ లిస్టులో ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: