విద్యార్థుల కోణంలో... ఓ సానుకూల తీర్పు ఇది. ఇంటర్నెట్‌ వినియోగ హక్కు అనేది విద్యాహక్కు, గోప్యతా హక్కులో భాగమేనని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.‘ఇంటర్నెట్‌ వినియోగ హక్కు అనేది ప్రాథమిక స్వేచ్ఛ అని, విద్యాహక్కు అమలుకు అదో పనిముట్టు అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి స్పష్టం చేసిన నేపథ్యంలో, విద్యార్థులకున్న ఆ హక్కును హరించే ఏ నిబంధననూ కోర్టు సమ్మతించజాలదు’ అని విచారణ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. 


నిషేధిత సమయంలో మొబైల్‌ ఫోన్‌ను వినియోగించిందనే కారణంతో ఓ విద్యార్థినిని కోజికోడ్‌లోని శ్రీనారాయణగురు కళాశాల యాజమాన్యం కాలేజీ హాస్టల్‌ నుంచి ఫాహిమా షిరిన్‌ అనే విద్యార్థిని బహిష్కరించింది. దీంతో తనను హాస్టల్‌ నుంచి బహిష్కరించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, కాలేజీని కోర్టు తప్పుపట్టింది. విద్యార్థినిని తిరిగి హాస్టల్‌లో చేర్చుకోవాలని ఆదేశించింది. విద్యార్థిని చదువుతున్న కళాశాల నిబంధనల ప్రకారం.. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు విద్యార్థులు మొబైల్‌ ఫోన్లు వినియోగించడానికి వీల్లేదు. విద్యనభ్యసించడంలో ఇది తమకు ప్రతిబంధకంగా మారిందని ఫాహిమాతోపాటు పలువురు విద్యార్థినులు నిరసన తెలియజేశారు.


ఇదిలాఉండ‌గా, ఇటీవ‌లే ఇంట‌ర్నెట్‌కు సంబంధించిన ఓ సంచ‌ల‌న స‌ర్వే వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో అం దుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనంగా మారుతున్నది. ఊరికే చూద్దామని యా ప్ ఓపెన్‌చేసి చివరికి ఏదోఒకటి ఆర్డర్ చేయడం అప్రయత్నంగానే జరిగిపోతోంది. దీంతో సంపాదనకు మించి ఖర్చుచేస్తూ పొదుపు అదుపు తప్పుతోంది. అనవసరపు వస్తువులు పేరుకుపోతున్నాయి. ఒకరికి డ్రెస్సులు/చీరలు అవసరమైతే నలుగురు షాపింగ్‌మాల్‌కు వెళ్తున్నారు. చివరికి నలుగురూ ఏదోఒకటి కొనుగోలుచేస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో పెండ్లి, శుభకార్యానికి వస్ర్తాలు కొనేవాళ్లు. ఇప్పుడు ఇంటికి పెండ్లిపిలుపు వస్తే, పెండ్లికి వెళ్లేందుకూ షాపింగ్ చేస్తున్న మ హిళల సంఖ్య ఎక్కువ అవుతోంద‌ని ఆ అధ్య‌య‌నం తేల్చింది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: