ఏరియా 51 గురించి అందరికి తెలిసిందే.  ఏరియా 51 నెవాడా రాష్ట్రంలోని ఎడారి ప్రాంతంలో ఉన్నది.  దీని గురించి చాలా కథనాలు ఉన్నాయి.  ఆ ప్రదేశంలోకి సామాన్య ప్రజలనుఅనుమతించరు.  కారణాలు ఏంటి అనే విషయం ఎవరికి పెద్దగా తెలియడం లేదు.  నెవాడా రాష్ట్రంలోని ఏరియా 51 అంటే ప్రతి ఒక్కరిలో ఓ భయం ఉన్నది.  ఆ భయాన్ని అమెరికా క్రియేట్ చేసింది. అవును.  ఏరియా 51 ప్రాంతంలో ఫ్లైయింగ్ సాసర్స్ ఉంటాయని, ఏలియన్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయని, అమెరికా ఆర్మీ ఏలియన్స్ ను పట్టుకున్నారని అందుకే ఆ ప్రాంతాన్ని నిషేదించారని అంటారు.  


ఆ ప్రాంతాన్ని అమెరికా ఎయిర్ బేస్ స్థావరంగా ఉపయోగించుకుంటోంది.  ఆ ప్రాంతంలోకి సామాన్య పౌరులను నిషేదించింది.  ఇప్పటి వరకు అక్కడికి మాములు వ్యక్తులు ఎవరిని అనుమతించలేదు.  దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం సగటు అమెరికన్ పౌరుడికి  తెలియడం లేదు.  అమెరికన్ పౌరుడికే తెలియనప్పుడు బయట ప్రజలకు ఎలా తెలుస్తోంది.  


అయితే, మనకు తెలియని విషయాలను గురించి తెలుసుకోవాలని ప్రతో ఒక్కరికి ఉంటుంది.  అందుకే ఇటీవలే సోషల్ మీడియాలో ఏరియా 51 ను ముట్టడిద్దాం ఏలియన్స్ ను చూద్దాం అనే పేరుతో సోషల్ మీడియాలో పేజీ ఓపెన్ చేశారు.  ఆ పేజీని ఓపెన్ చేసిన వ్యక్తి దాన్ని సరదాగా తీసుకున్నా అమెరికన్ పౌరులు మాత్రం సరదాగా తీసుకోలేదు.  15వేలకు పైగా  లైక్ లు వచ్చాయి.  అంటే, గత శుక్రవారం రోజున 100 మందికి పైగా నెవెడా రాష్ట్రంలోని ఏరియా 51 ప్రాంతం దగ్గరికి వీలేలేరు.  


అలా పెద్ద గుంపుగా వచ్చిన ఆ వ్యక్తులను లోనికి అనుమతించలేదు.   గుంపుగా వెళ్లిన వ్యక్తులను మొదటి గేట్ వద్దనే ఆపేశారు.  అక్కడి నుంచి మరోగేట్ దాదాలు.  వీరిని ఆపిన ప్రాంతం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఏరియా 51 ఉంటుంది.  ఈ ప్రాంతంలోనే ఏలియన్స్ ఉన్నాయని ప్రచారం.  అలా మొదటి గేటు దగ్గరికి వెళ్లిన అమెరికన్ పౌరులను అధికారులు, ఆర్మీ అడ్డుకుంది.  దీంతో అక్కడికి వచ్చిన వారంతా హ్యాపీగా రేవ్ పార్టీ చేసుకొని తిరిగి వెళ్లిపోయారు.  ఏరియా 51లో ఏమున్నదో తెలుసుకోవాలనే కుతూహలం అమెరికన్ ప్రజల్లో కలిగింది.  ఏదోఒక రోజు తప్పకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లి తీరుతామని ప్రజలు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: