దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నరేంద్రమోడీకి తిరుగులేదని అనిపిస్తోంది. మోడీ మొదటి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రపంచ దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకున్నారు.  ప్రపంచంలో భారతదేశానికి ఒక సముచిత స్థానం కల్పించారు.  ఇండియా అంటే ఒకప్పుడు చులకన భావం ఉండేది.  ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  ఇండియా అంటే ప్రపంచదేశాల్లో గౌరవంతో పాటు త్వరగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా పేరు తెచ్చుకుంది.  


ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎన్నో సమస్యలను మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాల్వ్ చేసింది.  అలాంటి వాటిల్లో ఒకటి జమ్మూ కాశ్మీర్ సమస్య.  జమ్మూ కాశ్మీర్లో ఇండియాలో భాగం అయినప్పటికీ స్వతంత్రంగా ఉండేది.  స్వతంత్రంగా ఉండటం వలన ఇండియాలోని చట్టాలు అక్కడ అమలు జరిగేవి కాదు. దీంతో అక్కడ ఎలాంటి సమస్య వచ్చినా చాలా కష్టంగా మారేది ప్రభుత్వానికి.  


జమ్మూ కాశ్మిర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియాలో పూర్తిగా విలీనం అయ్యింది.  ఇది శుభపరిణామం అని చెప్పాలి. ఇక మిగిలింది పీవోకే ఒక్కటే.  దాన్ని కూడా త్వరలోనే ఇండియా తనలో కలుపుకుంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.  ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో కూడా ఇండియాకు గౌరవం దక్కింది.  కాశ్మీర్ విషయంలో పాక్ అనుసరిస్తున్న విధానాలను ప్రపంచ దేశాలు సైతం అడ్డుపడుతున్నాయి.  వ్యతిరేకిస్తున్నాయి.  ఇది మంచి విషయం అని చెప్పాలి.  


ఇదిలా ఉంటె ఈనెల 22 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి.  ఇక 23 వ తేదీన పర్యావరణం గురించిన సమావేశం ఉన్నది.  ఈ సమావేశంలో మోడీ ప్రసంగించబోతున్నారు.  ప్రపంచదేశాలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు.  అంతేకాదు, మోడీ చేతుల మీదుగా ఐక్యరాజ్యసమితిలో ఏర్పాటు చేసిన సోలార్ పాక్ ను ఓపెన్ చేయబోతున్నాడు.  ఇది మోడీకి దక్కిన అరుదైన గౌవరం అని చెప్పాలి.  ఈ పార్క్ ఓపెనింగ్ కు ప్రపంచదేశాల అధినేతలు, ప్రధానులు పాల్గొనబోతున్నారు.  ఇండియా అంటే ఏంటో ఇప్పటికైనా పాక్ కు అర్ధం అయ్యే ఉండాలి.  ఇప్పటికైనా పాక్ పీవోకే ను అప్పగిస్తే.. పాక్ అభివృద్ధికి ఇండియా సహాయ సహకారాలు అందిస్తుంది.  లేదంటే పాక్ కు వినాశనం తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: