ఢిల్లీలో కొన్ని పుకార్లు వ్యాపిస్తున్నాయి.  కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత టాక్సీ డ్రైవర్ల దగ్గర అన్ని రకాల పత్రాలు ఉన్నా ఫైన్ వేస్తున్నారు.  కారణం ఏంటి.. ఎందుకు ఫైన్ వేస్తున్నారు అనే విషయాలు కొన్ని రోజులదాకా అర్ధం కాలేదు.  తీరా చూస్తే ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోవడం.  ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉండాల్సిన అన్ని ఖచ్చితంగా ఉంటె మాములుగా చూసి వదిలేస్తారు.  


ఏదైనా యాక్సిడెంట్ జరిగినపుడు తప్పకుండా ఫస్ట్ ఎయిర్ కిట్ ఉపయోగపడుతుంది.  ఆ కిట్ లో ఉండే చిన్న చిన్న వాటిద్వారా మొదట ఫస్ట్ ఎయిడ్ చెయ్యొచ్చు.  అయితే, ఇటీవల కాలంలో చాలా మంది దగ్గర ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండటంట్ లేదు.  దీంతో జరిమానాలు విధిస్తున్నారు.  ఇప్పుడు ప్రతి టాక్సీలో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ కనిపిస్తోంది.  ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉన్నా కూడా జరిమానాలు వేస్తున్నారట.  అందుకే తెలియక పాపం తికమక పడ్డారు టాక్సీ డ్రైవర్లు.  


అక్కడ పుకారు ఏంటంటే.. ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ కూడా ఉండాలి.  కండోమ్ లేకుంటే జరిమానా వేస్తున్నారని టాక్సీ డ్రైవర్లు చెప్తున్నారు.  ఫస్ట్ ఎయిడ్ కిట్ కి కండోమ్ కు సంబంధం ఏంటో తెలియదు.  ఇది ఢిల్లీ మొత్తం పాకిపోయింది.  అంటే.. మెడికల్ షాప్స్ ముందు టాక్సీ డ్రైవర్లు క్యూలు కట్టి మరీ కండోమ్ పాకెట్స్ కొనుక్కొని వెళ్తున్నారు.  పాపం ఎప్పటి నుంచో సేల్స్ కాకుండా ఉండిపోయిన కండోమ్ పాకెట్లు ఇలా సేల్ అవుతున్నాయి.  


అసలు నిజంగానే ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ ప్యాకెట్లు ఉండాలి.  ఎందుకు ఉండాలి అనే విషయం టాక్సీ డ్రైవర్లు తెలియదు.  ఎవరో దాన్ని పుట్టించారో తెలియదు.  ఇప్పుడు దాదాపుగా ఢిల్లీలోని ప్రతి టాక్సీలోని ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ పాకెట్ ఉంటోంది.  కొంతమంది డ్రైవర్లు చెప్పే సమాధానం భలే వింతగా ఉంటుంది.  దెబ్బతగిలినపుడు కండోమ్ తో కట్టుకడితే అది బ్యాండేన్ లా ఉండి రక్తం బయటకు రాకుండా అడ్డుకుంటుందని అంటున్నారు.  అయితే, దీనిపై పోలీసులు స్పందించి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కండోమ్ ఉండాలని, లేదంటే చలానాలు వేస్తామని పోలీసులు చెప్పలేదని, అలా ఎప్పుడు ఫైన్ వేయలేదని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: