హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి కృష్ణా న‌ది నుంచి మంచినీటిని త‌ర‌లిస్తున్న కృష్ణా ఫేస్-3  పైపులైనుకు   పలుచోట్ల ఏర్పడ్డ లీకేజీలను ఆరిక‌ట్టేందుకు అత్య‌వ‌స‌రంగా మ‌ర‌మ్మ‌త్తు ప‌నులను జ‌ల‌మండ‌లి చేప‌డుతుంది. ఇందుకోసం సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉద‌యం 6 గంట‌ల నుంచి సెప్టెంబరు 24వ  తేది  మంగళవారం ఉదయం 6గంట‌ల వ‌ర‌కు మొత్తం 24 గంట‌లపాటు తాగునీటి సరఫరా ఉండదు. దీనితో ఈ కింద ఇవ్వ‌బ‌డిన ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్పడ‌నుంది.



అంత‌రాయం క‌లిగే ప్రాంతాలను పరిశీలిద్దాం..సాహెబ్ నగర్, ఆటో నగర్, వైశాలి నగర్, మీర్ పేట్, జల్ పల్లి, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రిపురం, బండ్లగూడ,  బుద్వేల్, సులేర్ణన్ నగర్, హైదర్ గూడ, గోల్డెన్ హైట్స్, గంధంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, షేక్ పేట్,  ప్రశాసన్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగ్, బోడుప్పల్, చెంగిచర్ల, పిర్జాదిగూడ, సైనిక్ పురి,  మైలాలి, లాలాపేట్, స్నేహాపురి కాలనీ, కైలాసగిరి రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం.  కాబ‌ట్టి నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం క‌ల‌గనున్న ప్రాంతాల్లోని వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని కోర‌డ‌మైన‌ది.



ఇప్పటికే ఓఆర్ఆర్ గ్రామాలకు మంచినీటిని  అందించేందుకు ఘన్ పూర్ నుంచి సైనిక్ పురి మధ్య గోదావరి పైపులైను, రింగ్ మెయిన్ పైపులైనులకు జంక్షన్ లకు మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగింది. దీనితో ఆయా ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్పడింది.  హాస్మత్ పేట్, పేట్ బషీరాబాద్ బ్యాంక్ కాలనీ, మీనాక్షి,  డిఫెన్స్ కాలనీ, గౌతమ్ నగర్, చాణిక్యపురి, తిరుమల్ నగర్, గాయత్రి నగర్, అల్వాల్ మున్సిపల్ ఏరియా, లోతుకుంట, ఫాదర్ బాలయ్య నగర్ , రాధిక,  చెర్లపల్లి , కీసర, రాంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, హాకీంపేట్, సింగాయిపల్లి, దేవరయాంజల్, తూంకుంట, పోతాయిపల్లి, చెర్లపల్లి, తుర్కపల్లి, అహ్మాద్ గూడ, మెస్ త్రిశూల్, గన్ రాక్  ,  కంటోన్మెంట్ బోర్డు, రుద్రనగర్  ప్రాంతాల్లోని వినియోగ‌దారులకు మంచినీటికి ఇబ్బంది ఏర్పడింది. తాజాగా కృష్ణా ఫేస్ - 3 పైపు లైన్ కు కూడా మరమ్మత్తు పనులు చేపడున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: