టెక్సాస్ లోని హ్యూస్టన్.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది.  హ్యూస్టన్ లోని ఎన్ఆర్జీ స్టేడియంలో మోడీ సభ జరుగుతున్నది.  ఈ సభకు 50వేల మంది హాజరవుతున్నారు.  దీంతోపాటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా హాజరుకావడం విశేషం.  దీనికోసం రెండు నెలలుగా వాలంటీర్లు కష్టపడుతున్నారు.  మరికాసేపట్లో హౌడీ మోడీ కార్యక్రమం జరగబోతున్నది.  


ఈ సభలో కాశ్మీర్ అంశం చర్చకు రాకపోవచ్చు.  రాజకీయ అంశాలను గురించి చర్చించకపోవచ్చు.  రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో భారత్ ఎలా అభివృద్ధి చెందుతుందో.. భారతీయ అమెరికన్లు ఎలా దానికి సహాయ సహకారాలు అందించాలో మాట్లాడే అవకాశం ఉన్నది.  ఈ కార్యక్రమానికి డెమొక్రాట్స్, రేపబ్లికన్స్ హాజరవుతున్నారు. జమ్మూ కాశ్మీర్ సమస్యను ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ ఇండియాలో పూర్తిగా విలీనం అయ్యింది.  


టెక్సాస్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, దీని గురించి ఓ విషయం చెప్పుకోవాలి.  1991 కి ముందు పాకిస్తాన్ కు అమెరికా మిత్రపక్షం.  జమ్మూ కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని పలుమార్లు అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే.  పాక్ ప్రోద్బలంతో అమెరికా ఇండియాపై విమర్శలు చేసేది.  ఆ సమయంలో పీవీ నరసింహారావు అమెరికా చట్టసభల్లో మాట్లాడారు. టెక్సాస్ అమెరికాలో ఎలా భాగం అయ్యిందో అందరికి తెలుసునని,  అమెరికాకు చురకలు అంటించారు.  1868 కి ముందు టెక్సాస్ మెక్సికోలో భాగంగా ఉండేది.  ఆ తరువాత స్వతంత్ర దేశంగా మారింది.  అనంతరం అమెరికాలో భాగం అయ్యింది.  1868లో అమెరికన్ సుప్రీం కోర్టు ఈ విషయాన్ని ప్రకటించింది. 


అదే విధంగా ఇండియా కూడా కాశ్మీర్ విషయంలో ప్రవర్తిస్తుందని, ఎప్పటికైనా కాశ్మీర్ ఇండియాలోనే భాగంగా ఉంటుందని అన్నారు.  పీవీ అంటించిన చురకలు అమెరికాకు బాగానే తాకాయి.  ఆ తరువాత ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యాక మొత్తం మారిపోయింది.  అమెరికా ప్రజలు మోడీవైపు చూస్తున్నారు.  మోడీకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు.  గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు అమెరికా వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు.  ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి స్వగతం పలుకుతున్నారు.  ఛరిష్మా అంటే అది మరి


మరింత సమాచారం తెలుసుకోండి: