ఒకప్పుడు ఆకలేస్తుందంటే అప్పటికప్పుడు వండుకోవల్సిన పరిస్థితి ఉండేది. పైగా రుచికరమైన ఆహారం గానీ, మటన్, చికెన్ అలా ఏదైన నాన్ వేజ్ కావాలంటే షాపుకెళ్లి తీసుకొచ్చి వండుకునే పరిస్థితి ఉండేది. ఇదంతా రిస్కుతో కూడుకున్నది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. ఏ ఫుడ్ కావాలన్నా..నిమిషాల్లో మన ముందుంటుంది. పైగా ఆన్ లైన్  లో ఫుడ్ ఆర్డర్ చేయడమే. ఈ మధ్య ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ కంపెనీలు కొక్కోల్లలుగా ఉన్నాయి. జోమోట, స్విగ్గీ ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఆన్ లైన్ ఫుడ్ గురించి ఇప్పుడెందుకు చెప్పడమేంటని అనుకుంటున్నారా…? ఇందులోనే జరిగింది అసలైన పొరపాటు. ఇక ముందు మీరు కూడా జాగ్రత్తగా ఉంటారనేది  ఈ వార్త సారాంశం. ఈ ఘటన పంజాబ్ లోని కపూర్ధలా అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే ఓ వ్యక్తి ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ ఫుడ్ ఆర్డర్ చేయగా, సదరు ఫుడ్ సప్లయ్ చేసే కంపెనీ నాన్‌వెజ్ పంపింది. ఆర్డర్ చేసిన సదరు వ్యక్తులు ఇద్దరు పోనిలే ఏదో ఒకటి తినేస్తే పోలా…అంటూ దానిని తిన్న ఇద్దరు కూడా అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆర్డర్ చేసిన ఫుడ్ ను తిన్న సచిన్, ఆశీష్‌లను వారి స్నేహితులు అర్థరాత్రి సమయంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాధితులకు వైద్యులు చికిత్సను అందించి తిరిగి డిశ్చార్జ్ చేశారు. దీనిపై సదరు వ్యక్తులు ఫుడ్ ఇన్సుపెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

Image result for chicken biryani

అయితే ఈ విషయం ఇందుకు కారణమైన ప్రముఖ పిజ్జా స్టోర్ యజమాని వరకు వెళ్లింది. ఈ విషయమై కపూర్థలాలోని పిజ్జా స్టోర్ యజమాని మాట్లాడుతూ తమకు ఆన్‌లైన్ ఫుడ్ సప్లయ్ కంపెనీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే ఫుడ్ ను పంపించామని అన్నారు. దీనిలో తాము చేసిన తప్పేమి లేదని పేర్కొన్నారు. కాగా స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్, పన్నీర్ బర్గర్, స్పయిసీ కబాబ్ ప్లేటర్ ఆర్డర్ చేయగా ఆన్‌లైన్ ఫుడ్ సప్లయ్ కంపెనీ నుంచి నాన్ వెజ్ వచ్చింది. సో…మీరు కూడా అర్డర్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి….వచ్చాక కూడా అది ఫ్రెష్ దేనా..? కాదా..అని తెలుసుకోండి. ఏదేమైన ఆన్ లైన్ లో ఫుడ్ ను ఆర్డర్ చేసే ముందు ఏ హోటల్ లో ఫుడ్ బాగుంటుందో, ఏది బాగుండదో తెలుసుకొండి. ఎక్కడి పడితే అక్కడ ఆర్డర్ చేస్తే ఇలాంటి చిక్కులు వచ్చి పడతాయి. ఇంకా చెప్పాలంటే మీరే ఇంట్లో వండుకుని తింటే మరి మంచిది. తస్మాత్ జాగ్రత్త.


మరింత సమాచారం తెలుసుకోండి: