దేశవ్యాప్తంగా బ్యాంకుల కార్యకలను సంభింపచేసేందుకు ఉద్యోగ సంఘాలు సన్న ర్ధమవుతున్నాయి. దీనితో 48గంటల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటన చేశాయి.  సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు యూనియన్ నేతలు వెల్లడించారు. తమ సమ్మె వల్ల 48వేల కోట్ల రూపాయాల లావాదేవీలపై ప్రభావం పడనుందన్నారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు రాజీ పడే ధోరణి లేకుండా ఉద్యమించేందుకు సర్వసన్నర్ధమవుతున్నారు.



ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన ఓ పత్రాన్ని విడుదల చేసారు. ఆ  పత్రంలోని ప్రధానాంశాలు ఇవే.. బ్యాంకుల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని,  బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను ఆపాలని,  మొండి బకాయిలను వసూలు చేయాలని,  రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని,  కస్టమర్లను చార్జీల బాదుడుతో బాధపెట్టొద్దని,  ఉద్యోగ భద్రతపై ఆందోళనలు రేకెత్తించొద్దని తమ డిమాండ్ పత్రంలో పేర్కొన్నారు. సమ్మెతో సామాన్యులకు ఇబ్బందులు కలుగుతాయి కదా అని ప్రశ్నించగా.. ప్రజలను దృష్టిలో పెట్టుకొనే బ్యాంకుల బంద్ కు కార్యాచరణను రూపొందించినట్టు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే బంద్ చేపట్టనున్నామని చెప్పారు. ఆ మేరకే   పిలుపు నిచ్చినట్టు యూనియన్ నేతలు తెలిపారు.  ఆఖరి ప్రయత్నంగా సమ్మె అస్త్రాన్ని ప్రయోగిస్తున్నామన్నారు.




ఇదిలా ఉండగా బ్యాంకుల బంద్ తో రెండు రోజులు కాదు ఏకంగా ఐదు రోజుల పాటు బ్యాంకు లకు వరుస సెలవులు రానున్నాయి.  ఈ నెల 26 నుంచి 30 వరకూ వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్‌ కానున్నాయి. ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె చేస్తామని బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. ఆ తర్వాత 28వ తేదీ నాలుగో శనివారం, 29 ఆదివారం. ఆ రెండు రోజులూ బ్యాంకులు పని చేయవు. ఇక, ఈ నెల 30న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. ఆ రోజూ లావాదేవీలు ఉండవు. అక్టోబరు ఒకటో తేదీన బ్యాంకులు పని చేయనున్నాయి. ఆ వెంటనే అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. బ్యాంకుల సమ్మె, అర్ధ సంవత్సర ముగింపు రోజుల్లో నెఫ్ట్‌ లావాదేవీలు ఉన్నా.. బ్యాంకుల్లో నగదు లావాదేవీలు ఉండవు. అంటే బ్యాంకు యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు వెళితే.. వరుసగా ఐదు రోజులపాటు వ్యాపార, నగదు లావాదేవీలు మాత్రమే కాదు.. ఉద్యోగుల జీతాలకూ ఇబ్బంది తప్పదు



మరింత సమాచారం తెలుసుకోండి: