గతంలో బాబు అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేపట్టారు.  ఆ పాదయాత్ర చేపట్టిన సమయంలో బాబు అనేక సమస్యల గురించి తెలుసుకున్నారు.  ఆ సమస్యలపై పెద్దగా స్పందించలేదు.  సమస్యలు తెలుసుకొని హామీలు మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్లారు.  అలా ఇచ్చిన హామీలు బాబు నెరవేర్చినట్టయితే బాబు పరిస్థితి అలా ఉండి ఉండేది కాదు. ఏం జరిగిందో ఏమో తెలియదుగాని మొత్తానికి ఆ తరువాత బాబు ఓడిపోయారు.  


2004 కు ముందు వైఎస్ కూడా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు.  వైఎస్ వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ, 108, 104ను తీసుకొచ్చారు.  ఇవి ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి.  ఇదే ఆయన్ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశాయి.  2009 లో తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న సమయంలో కూడా వైఎస్ ముఖ్యమంత్రి కాగలిగారు అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ అని చెప్పాలి. 


దీనిద్వారా ఎంతో మంది లబ్ది పొందారు.  ఇదే ప్రజలను వైఎస్ ప్రభుత్వానికి చేరువ చేసింది.  చేరువ కావడంతో రెండుసార్లు అయన ముఖ్యమంత్రి అయ్యారు. అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.  తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అదే సమయంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. వైకాపా స్థాపించారు.  


వైఎస్ మరణం తరువాత జనాల్లోకి వెళ్లారు. జనాల్లో జగన్ పర్యటించారు.  ఆ తరువాత జగన్ ను అరెస్ట్ చేసి జైలుకు వెళ్లిన తరువాత కూడా షర్మిల పాదయాత్ర చేసి అన్నకు సపోర్ట్ చేసింది.  ఆ తరువాత జగన్ జైలు నుంచి వచ్చిన తరువాత తిరిగి పాదయాత్ర చేశారు.  అలా పాదయాత్ర చేసిన జగన్ ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడమే కాకుండా..అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు.  అలా నెరవేర్చిడం వలన జగన్ పరపతి పెరిగింది.  జగన్ కు బలం పెరిగింది.  ఇచ్చిన హామీలను ఇలా నెరవేర్చుకుంటూ వెళ్తే.. తప్పకుండా జగన్ వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారు అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: