అనుకున్నది ఒక్కటి జరిగేది మరోటి.అన్నట్టుగా వుంది తెలంగాణ పరిస్దితి.ఎందుకంటే రాష్ట్రం వచ్చిన సందర్భంలో మిగులుగా వుండే బడ్జెట్ ఇప్పుడు దిగులుగా మారిందట.ఇది నేనంటున్న మాట కాదు,కాగ్ రిపోర్టులో తెలిసిన నిజం.తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఆదివారం కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది.ఈ నివేదికలో రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది.ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర ఖజానాపైనా పడిందని సీఎం కేసీఆర్ తెలిపారు.లాభాలను ఆశించి చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాలేదని,ఫలితంగా కోట్లలో నష్టం వాటిల్లిందని కాగ్ రిపోర్టులో స్పష్టం చేసింది. మూలధన వ్యయం విషయంలో తెలంగాణ ముందంజలో ఉన్నప్పటికీ,విద్యారంగం కేటాయింపులు తక్కువగా ఉన్నాయని, కొన్నేళ్లుగా అప్పులు పెరగడంతో వడ్డీల చెల్లింపులు పెరిగాయని తెలిపింది.కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర అప్పులు రూ.1.42 లక్షల కోట్లకు చేరాయి.



రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపులు 12.19 శాతంగా ఉన్నాయి.రానున్న ఏడేళ్లలో రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులు రూ.65,740 కోట్లుగా ఉన్నాయి.ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు,జీఎఎస్‌డీపీ నిష్పత్తిలో 19 శాతంగా ఉన్నాయి.ఇది 14 వ ఆర్థిక సంఘం నిర్ణయిచిన 22.82% పరిమితికి లోబడి ఉంది.ఇకపోతే తెలంగాణ రెవెన్యూ లోటు రూ.284.74 కోట్లుగా ఉంది.ద్రవ్యలోటు రూ.27,654 కోట్లని కాగ్ రిపోర్టు బహిర్గతం చేసింది.2014-19 మధ్య ప్రాజెక్టులపై రూ.79,236 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంది. రాష్ట్రంలో చేపట్టిన 19 ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.41,021 కోట్లు కాగా.చేపట్టిన నిర్మాణ పనులు ఆశించినంత వేగంగా ముందుకెళ్లక పోవడంతో.అంచనాలు రూ.1.32 లక్షల కోట్లకు పెరిగాయట.ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులను,పేదల సంక్షేమాన్ని మాత్రం ఆపబోమని అబద్దాలు చెప్పే ఖర్మ మాకు లేదని కేసీఆర్ చెప్పారు.



కానీ ఆర్థిక మాంద్యం కారణంగా డబ్బులు లేవంటోన్న కేసీఆర్ వీటిని ఎలా అమలు చేస్తారో చూడాలి.ఇక ఇప్పటికే కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూ ఇది బంగారు తెలంగాణ కాదు.రాష్ట్రం అప్పుల కుప్పల తెలంగాణలా మారిందని ధ్వజమెత్తారు.ఈ విషయం పై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు.అవును‘ అప్పులు చేశామని మేమే చెబుతున్నాం.ఇందులో ఆరోపణలు చేయడానికి ఏముంది.అవసరమైతే ఇంకా అప్పులు తెస్తాం.దీని వల్ల ఎవరికేం నష్టం ఉండదు.ప్రజలు బాగుపడతారు.త్వరగా ఫలితాలు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం.తెచ్చిన అప్పును దేని మీద ఖర్చు చేస్తామన్నదే పాయింట్’అని సమాధానం చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: